Zodiac Signs : ఈ మూడు గ్రహాల సంచారంతో ఈ రాశుల వారికి అధిక ధన లాభం… నక్క తోక తొక్కినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : ఈ మూడు గ్రహాల సంచారంతో ఈ రాశుల వారికి అధిక ధన లాభం… నక్క తోక తొక్కినట్లే…!

Zodiac Signs : సెప్టెంబర్ నెలలో పెద్ద గ్రహాలైన శుక్రుడు బుధుడు సూర్యుడు తమ రాశి చక్రాలను మార్చుకుంటూ సంచారం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 4వ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. మరియు సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు కన్యారాశిలో సంచరించనున్నాడు. అంతే కాకుండా సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు తులారాశిలో ప్రవేశించబోతున్నారు. అయితే ప్రస్తుతం బుధుడు సింహరాశిలో సంచారం చేస్తుండగా సెప్టెంబర్ 23వ తేదీన కన్యరాశిలో సంచారం చేయనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 September 2024,2:00 pm

Zodiac Signs : సెప్టెంబర్ నెలలో పెద్ద గ్రహాలైన శుక్రుడు బుధుడు సూర్యుడు తమ రాశి చక్రాలను మార్చుకుంటూ సంచారం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 4వ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. మరియు సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు కన్యారాశిలో సంచరించనున్నాడు. అంతే కాకుండా సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు తులారాశిలో ప్రవేశించబోతున్నారు. అయితే ప్రస్తుతం బుధుడు సింహరాశిలో సంచారం చేస్తుండగా సెప్టెంబర్ 23వ తేదీన కన్యరాశిలో సంచారం చేయనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. ఈ రాశుల వారు వ్యాపార రంగంతో పాటు ఇతర రంగాల్లో కూడా విజయాలను సాధిస్తారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Zodiac Signs మేషరాశి

ఈ సమయంలో మేష రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడతాయి. దీనివల్ల రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట సహ ఉద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. వీరు ఏ పని తలపెట్టిన అందులో విజయాలను సాధిస్తారు. అలాగే వీరి పనితీరు మెరుగుపడుతుంది. మేషరాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. దీనివల్ల అద్భుత ఫలితాలు వీరి జీవితంలో ఏర్పడతాయి.

సింహరాశి.

సింహరాశిలోని 12వ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడడం వలన వీరికి ఆకస్మిక ధనయోగం ఉంటుంది. ఈ సమయంలో వీరు డబ్బులను ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఇక వ్యాపారుల విషయానికి వస్తే వ్యాపారులు తమ వ్యాపారాలని ఇతర ప్రాంతాలకు విస్తరింప చేయడానికి కొత్త అవకాశాలు దొరుకుతాయి. జీవిత భాగ్య స్వామి సలహాలతో సింహరాశి వారు జీవితంలో విజయాలను సాధించడంతోపాటు అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి.

Zodiac Signs

Zodiac Signs

కన్యా రాశి.

కన్యారాశిలో ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. పెట్టుబడుల నుండి లాభాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి చూపిస్తారు. అలాగే మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక ఈ సమయంలో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కన్య రాశి వారు ఆర్థికంగా బలపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది