Ugadi Festival 2024 : ఏప్రిల్ 9 ఉగాది లోపు ఎవరైనా ఈ కథ వింటే చాలు… మీ దశ తిరిగి ఇల్లంతా డబ్బే డబ్బు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ugadi Festival 2024 : ఏప్రిల్ 9 ఉగాది లోపు ఎవరైనా ఈ కథ వింటే చాలు… మీ దశ తిరిగి ఇల్లంతా డబ్బే డబ్బు…!

 Authored By ramu | The Telugu News | Updated on :30 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Ugadi Festival 2024 : ఏప్రిల్ 9 ఉగాది లోపు ఎవరైనా ఈ కథ వింటే చాలు... మీ దశ తిరిగి ఇల్లంతా డబ్బే డబ్బు...!

Ugadi Festival 2024 : ఉగాది అంటే మనందరికీ గుర్తుకొచ్చేది తెలుగు వారి పండుగ. కచ్చితంగా తెలుగు సంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతి లాంటివి చేపించుకుని సుఖంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఉగాది విశిష్టత ఏంటి చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోముఖుడు వేదాలను తస్కరించిన ఇటువంటి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోమ కాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుని దగ్గర నుంచి వేదాలను దొంగలించి ఓ పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో దాచేస్తాడు.

బ్రహ్మదేవుడు సృష్టి రక్షణ చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోముకాసురుడు అనే రాక్షసుడు అపహరించాడు అనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీమహావిష్ణువు మత్సావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లలో ఉండేలా చేయాలనుకుంటున్నా. సోమకాసురుడిపై స్వామివారు విరుచుకుపడి సంహరిస్తాడు. ఆ విధంగా సముద్ర గర్భంలో ఆయన దాచినటువంటి వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఇదంతా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. కనుక అది ఉగాదిగా మొదలు కావడంతో ఈరోజును మనం ఉగాదిగా చెప్పుకుంటున్నాం..ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది. అదేవిధంగా ఈ ఉగాది పేరు నామ సంవత్సరం మనకు 60 ఉగాది పేర్లు ఉన్నాయి.

అవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి మల్ల వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుని తర్వాత కీలకమైన గ్రహాలు శని ఇంకా గురుడు ఈ రెండు గ్రహాలు ఉన్న చోట బయలుదేరి మళ్ళా అది ప్రదేశానికి తిరిగి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల ప్రతి 60 సంవత్సరాలకే ఉగాది పేరు మరలా వస్తుంది. ఉగాది రోజున షడ్రుచులు అంటే ఆరు రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి తినడం ఇలా చేయడం ద్వారా జీవితంలో సుఖదుఃఖాలు ప్రేమ అనురాగాలు జయపజయాలు అన్నిటిని కూడా జీవితంలో సమానంగా స్వీకరించాలని పరమార్థం. ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కో రకమైన భావానికి సంకేతంగా చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం కూడా మన సంప్రదాయం కనుక భవిష్యత్తు ఎలా ఉంటుంది? గ్రహగమనాలు ఆధారంగా వర్షాల పరిస్థితి ఏంటి అనే మొదలైన విషయాలు పంచాంగ శ్రవణంలో తెలియజేస్తారు.

కచ్చితంగా ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రోజు అని అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒక రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి యుగం అంటే ఆది అని కూడా అర్థం వస్తుంది. యుగా అంటే ఆది అనడంతో ఈ విధంగా ఆది అంటే మొట్టమొదటి అని అర్థం కూడా వస్తుంది.కాబట్టి ఈ ఉగాది రోజునే మన జీవితాన్ని కూడా నూతనంగా ప్రారంభించాలని ఇప్పటివరకు ఉన్న సమస్యలు కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఇంకా జీవితాన్ని ఒక కొత్త సరికొత్త ఆశయంతో ఆశతో ముందుకు ప్రారంభించాలని ఈ ఉగాది పండుగ మనకు సూచకగా తెలియజేస్తుంది. ఈ విధంగా ఉండటం వల్ల జీవితాన్ని ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహలతో తీసుకోకుండా ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించాలన్న ఉద్దేశమే ఈ ఉగాది పండుగ యొక్క పరమార్థం…

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది