Varahi Navratri : వారాహి నవరాత్రి ఆరవ రోజు పచ్చ కర్పూరంతో గుమ్మం దగ్గర ఇలా చేస్తే.. అమ్మ మీ ఇంటిని డబ్బుతో నింపేస్తుంది..!
Varahi Navratri : వారాహి నవరాత్రి ఆరవ రోజు పచ్చ కర్పూరంతో గుమ్మం దగ్గర ఇలా చేస్తే అమ్మ మీ ఇంటిని డబ్బుతో నింపిస్తుంది. వారాహి అమ్మవారి నవరాత్రి ఆరవ రోజు పచ్చ కర్పూరంతో గుమ్మం దగ్గర ఏ పరిహారం చేస్తే వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో… ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందో.. తెలుసుకుందాం. వారాహి అమ్మవారి అంటే భూదేవి హిరనాక్షకుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్లినప్పుడు శ్రీమహావిష్ణువు వరాహరూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామి వారు మీద భక్తితో అప్పుడు అమ్మవారు ఈ రూపం తీసుకుందని అందువలన ఈమె వరాహ స్వామి యొక్క శ్రీరూపమని కొన్ని ధ్యాన శ్లోకాలు కనిపిస్తుంది. అమ్మవారిని చీకటి దేవత అంటూ ఉంటారు.
అందుకని ఈ పూజను చీకటి సమయంలో చేస్తారని చెప్పి ఈ శాస్త్రాలు చెప్తున్నాయి. కోరిన కోరికలలో తీర్చే వరాల జల్లులు కురిపించే వారాహి అమ్మవారు మహిమలు అంతా ఇంతా కాదు అమ్మవారిని ఎవరు తలుచుకుంటే వారికి ప్రత్యక్షమై ఆమె అనుగ్రహాన్ని కలిగిస్తుంది. వారాహి దేవి నమః అని ఒక మంత్రాన్ని జపిస్తే చాలు.. ఇక మన ఇంటిలో ఎటువంటి దుఃఖాలు కన్నీళ్లు దుష్టశక్తులు దరి చేరవు.. అమ్మ అన్ని కూడా చూసుకుంటుంది. అమ్మవారి నవరాత్రి ఆరవ రోజు పచ్చ కర్పూరంతో ఇంటి గుమ్మం దగ్గర ఇలా చేసినట్లయితే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి.
మీ ఇంట్లోకి వచ్చే సకల దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మీ జీవితం ఉంటుంది. బ్రహ్మచర్యం పాటించడం ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారం తినడం ఇలాంటివి తప్పనిసరిగా పాటించాలి. అమ్మవారిని పూజించిన తర్వాత సాయంత్రం వేళలో ఒక మట్టి ప్రమిదలో పచ్చ కర్పూరాన్ని మీరు పెట్టండి. పచ్చ కర్పూరం పెట్టిన తర్వాత దాన్ని సింహద్వారానికి కర్పూరాన్ని వెలిగించి దిష్టి తీయండి. దిష్టి తీసిన తర్వాత ఆ కర్పూరం వెలుగులో అంటే ఆ కర్పూరం మంటల్లో మీరు గనక ఆవాలు నల్ల ఆవాలు అవి చిటికెడు వేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న అనేక రుగ్మతులన్నీ కూడా బయటికి పోతాయి.
అనేక శక్తులు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాయి. మట్టి ప్రమిదను తీసుకున్న తర్వాత వేసుకొని దాని మీద కర్పూరం పెట్టి కూడా మీరు ఇంటికి దిష్టి తీయొచ్చు. కర్పూరం వెలిగించుకొని అలాగే చేయొచ్చు. ఇలా చేసినట్లయితే కన్ను దిష్టి నరుగోష, నకారాత్మ శక్తులు శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఎప్పుడూ కూడా సంతోషం ఆనందం అనేది మీ ఇంట్లో తాండవం చేస్తుంది..