Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు.. పూజా సమయం, ఇతర విశేషాలు ఇవే..!
ప్రధానాంశాలు:
Varalakshmi Vratam వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు.. పూజా సమయం, ఇతర విశేషాలు ఇవే..!
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. సంపద, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం మహాలక్ష్మి దేవిని భక్తిశ్రద్ధలతో పూజించే పవిత్ర పర్వదినం ఇదే. హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి అధిదేవతగా పూజించబడుతుంది. ఈ పూజను శ్రావణ మాసం శుక్ల పక్షంలోని రెండో శుక్రవారం జరుపుతూ, అష్టలక్ష్ములను ఆరాధించినట్లు భావిస్తారు.

Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు.. పూజా సమయం, ఇతర విశేషాలు ఇవే..!
varalakshmi vratam : ఎలా జరుపుకోవాలి..
అష్టలక్ష్ములు అంటే శ్రీ (సంపద), భూ (భూమి), సరస్వతి (విద్య), ప్రీతి (ప్రేమ), కీర్తి (యశస్సు), శాంతి (ప్రశాంతత), తుష్టి (సంతృప్తి), పుష్టి (ఆరోగ్యం). ఈ ఎనిమిది రూపాల్లో లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.లగ్నము పూజా సమయం చూస్తే.. సింహ లగ్నం ఉదయం 6:42 AM – 8:47 AM, వృశ్చిక లగ్నం మధ్యాహ్నం 1:00 PM – 3:13 PM, కుంభ లగ్నం సాయంత్రం 7:11 PM – 8:50 PM, వృషభ లగ్నం అర్ధరాత్రి తర్వాత (ఆగస్టు 9) 12:14 AM – 2:15 AM
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్థిర లగ్నంలో, ముఖ్యంగా ప్రదోషకాలంతో కూడిన సాయంత్రపు పూజ అత్యంత శ్రేయస్సు నిచ్చేదిగా పరిగణించబడుతుంది. భక్తులు తమ ప్రాంతానికి అనుగుణంగా స్థానిక పంచాంగం ద్వారా సమయం నిర్ధారించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా నవరత్నాలతో అలంకరించిన వరలక్ష్మి అమానాన్ని పూజిస్తూ, కుటుంబ శాంతి, ఐశ్వర్యం కోసం దీర్ఘకాలికమైన సంకల్పంతో ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించే వారికి ఆర్థిక స్థిరత.ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, కోరికల నెరవేరుతాయి అని నమ్ముతారు. లక్ష్మీదేవి ఆ రోజు భక్తుల ఇళ్లకు విచ్చేసి, అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని పురాణ కథనాలున్నాయి.