Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం శుభ సమయం ఎప్పుడు..? శ్రావణమాసంలోనే వ్రతాన్ని ఎందుకు చేస్తారు తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం శుభ సమయం ఎప్పుడు..? శ్రావణమాసంలోనే వ్రతాన్ని ఎందుకు చేస్తారు తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :26 July 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం శుభ సమయం ఎప్పుడు..? శ్రావణమాసంలోనే వ్రతాన్ని ఎందుకు చేస్తారు తెలుసా...?

Varalakshmi Vratam : శ్రావణమాసం ఎంతో పవిత్రమైనది. ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. వనవాసం వస్తుంది అంటేనే మహిళలకు ఎంతో సంతోషంగా ఉంటుంది. వారు ఈ నెలలో స్త్రీలు నోములు వ్రతాలు చేస్తుంటారు. శ్రావణమాసం అంతా ఆధ్యాత్మిక మాసం. మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం చేస్తారు.శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతంను ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు భార్య అయినా వరలక్ష్మీదేవిని పూజిస్తే వరలక్ష్మీ వ్రతం చేసి ఆమెను ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. మహిళలకు సౌభాగ్యం కొరకు ఈ శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. 2025 సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతంను ఎప్పుడు ఆచరించాలి, తేదీ, శుభ సమయం, వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత తెలుసుకుందాం.. ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రత మనో స్త్రీలు జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మహిళలకు శ్రేయస్సు, సంపద, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సౌభాగ్యం కలుగుతుందని వారి నమ్మకం. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకునేందుకు పూజ్యనీయమైనవే. అయితే పురాణాల ప్రకారం ఈ నెలలో శుక్ర పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనాదిగా వస్తున్న ఆచారం.

Varalakshmi Vratam వరలక్ష్మీ వ్రతం శుభ సమయం ఎప్పుడు శ్రావణమాసంలోనే వ్రతాన్ని ఎందుకు చేస్తారు తెలుసా

Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం శుభ సమయం ఎప్పుడు..? శ్రావణమాసంలోనే వ్రతాన్ని ఎందుకు చేస్తారు తెలుసా…?

ఎంతో విశిష్టమైన రోజుగా భావించి శ్రీమహావిష్ణువు భార్య మహాలక్ష్మిని వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తుంటారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో అధికంగా స్త్రీలు కొలుస్తూ ఉంటారు వివాహిత మహిళలకు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవికి చేసే పూజ అష్టలక్ష్మి పూజలకు సమానమని నమ్మకం వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఈ దేవతలను పూజించిన ఫలితం ఉంటుంది. లక్ష్మీ దేవతలు మన పూజకు మెచ్చి మన ఇంట సిరుల పంటను కురిపిస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో,వారు ఆ రోజున ఉపవాసం ఉండడం వలన వారికి అష్టైశ్వర్యాలు, సంపద,భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి,సంతోషం, శక్తి వంటివి అన్నీ కూడా లభిస్తాయని విశ్వాసం. ఈ 2025వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు, ఏ తేదీన వచ్చిందో, జరుపుకొనుటకు శుభసమయం ఏమిటో తెలుసుకుందాం…

Varalakshmi Vratam వర లక్ష్మీ వ్రతమును ఎలా ఆచరించాలి

వర లక్ష్మి వ్రతం సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి. ఈ వ్రతం చేసే ముందు పూజ నియమాల ప్రకారం మొదట. విజ్ఞాధిపతికి పూజ చేసి అనంతరం నమస్తే శంఖచక్ర గదా హస్త మహాలక్ష్మి నమోస్తుతే. అంటూ లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టాలి.. ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసి, వరలక్ష్మి దేవిని ఆవాహన చేసి, సోడోపచార పూజా తరువాత ఆదాంగా పూజ చేయవలెను. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి,ధూప, దీప,నైవేద్యాలను, తాంబూలాలను సమర్పించే మంగళహారతినిచ్చి. తోరగ్రంథి పూజ చేసి, తోర బంధన మంత్రం పటిస్తూ ఆ నవ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలని నవకాయ పిండి వంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించాలి. చివరిగా రవిక, పసుపు, కుంకుమ, తాంబూలం తో పాటు వాయనాధన మంత్రం పటిస్తూ ముత్తైదువులని మహాలక్ష్మి గా భావించి వాయినాన్ని ఇవ్వాలి.

Varalakshmi Vratam 2025వ సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు :

ఈ పండుగను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. వారు తమ మతం ప్రకారం శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8 2025న వచ్చింది.
వరలక్ష్మీ వ్రతం 2025న ముహూర్తం : సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 06 : 29. ఉదయం 08:46 వృచ్చిక లగ్న పూజ ముహూర్తం మధ్యాహ్నం. మధ్యాహ్నం 01:22 – మధ్యాహ్నం 03:41 కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం – రాత్రి 07: 27 నుంచి 8 : 54 వృషభ లగ్న పూజ ముహూర్తం. అర్ధరాత్రి 11: 55 pm 0:15 am ఆగస్టు 9.
లక్ష్మీదేవిని పూజించడానికి ఉత్తమ సమయ స్థిరమైన లగ్న సమయం నమ్మకాల ప్రకారం స్థిరమైన లగ్న సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల దీర్ఘకాలిక శ్రేయస్సు లభిస్తుంది.

వర లక్ష్మీ వ్రతంలో తోరణం ప్రాముఖ్యత : వర లక్ష్మీ వ్రతం సమయంలో 9 ధారపు పోగులతో, తొమ్మిది వరుస ముడుల మధ్య పంచపుష్పాలను కట్టి,పసుపు పూసి దారాన్ని తోరణంగా కడతారు. తోరణాన్ని వరలక్ష్మీ వ్రతం పూజ సమయంలో అమ్మవారి ముందట పెట్టి దానికి తోరణాగ్రంతి పూజ చేయవలెను పూజ చివరిలో ఈ తోరణాన్ని తీసుకొని రక్షణ చిహ్నంగా కుడి మణికంటుకి ధరించాలి.
శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే..ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు, ధైర్యం, శక్తి,అష్టలక్ష్మి దేవతలు కొలువై ఇంట్లో స్థిర నివాసమై ఉంటారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది