Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం రోజు బీరువాలో ఇది పెడితే 24 గంటల్లో కోటీశ్వరులు అవుతారు ..!
Varalakshmi Vratam : శ్రావణమాసం రెండో శుక్రవారం పైగా వరలక్ష్మీ వ్రతం బీరువాలో ఇది పెడితే చాలు 24 గంటల్లో మీ సుడి తిరిగి కోటీశ్వరులు అవుతారు. శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం మన సాంప్రదాయం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని పూజిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహం అయిన మహిళలు నిర్వహిస్తారు. సకల ఐశ్వర్యాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతాయి దయాగుణం సంపద కలబోసిన తల్లి వరలక్ష్మిదేవి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం గా భావిస్తారు. ఈ పండుగను మహిళలు ఎంతో వైభవంగా చేసుకుంటారు.
అయితే ఈ వరలక్ష్మీ వ్రతం రోజున బీరువాలో ఇది పెట్టుకుంటే కనుక 24 గంటల్లో కోటీశ్వరులు అవుతారు. ఈ వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పసుపు గవ్వలతో ఈ పరిహారాన్ని చేయండి. ముందుగా ఎరుపు రంగు గుడ్డను తీసుకొని అందులో ఐదు పసుపు గవ్వలు వేసి ఆరు రూపాయి కాసులు తీసుకొని వీటిని కూడా ఎర్రటి గుడ్డలు వేయాలి. ఇప్పుడు అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి వాటిని మూటగా కట్టాలి. ఇప్పుడు ఈ మూటకి సాంబ్రాణి ధూపం చూపించి బీరువాలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.
ఇలా చేస్తే ఇంట్లో ధనానికి లోటు ఉండదు. వరలక్ష్మీ వ్రతం రోజున చక్కగా వరలక్ష్మీదేవికి పూజ చేసి అమ్మవారికి పంచభక్ష పరమాన్నాలు సమర్పించిన తర్వాత ఈ పరిహారాన్ని కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇంట్లో డబ్బు నిలవడం లేదని సంపాదించినదంతా ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు. చేస్తున్న ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటూ కొత్త ఉద్యోగం ఆదాయ మార్గాల కోసం ఎదురుచూసేవారు అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజున పసుపు గవ్వలతో ఈ పరిహారాన్ని చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది.