Vastu Shastram for Money : మీ ఇంట్లో ఈ దిశ కుబేర దిశ… అక్కడ ఉంచితే ఆర్థికంగా..ఈ వాస్తు చిట్కాలు పాటించండి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Shastram for Money : మీ ఇంట్లో ఈ దిశ కుబేర దిశ… అక్కడ ఉంచితే ఆర్థికంగా..ఈ వాస్తు చిట్కాలు పాటించండి..?

 Authored By ramu | The Telugu News | Updated on :13 March 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Vastu Shastram for Money : మీ ఇంట్లో ఈ దిశ కుబేర దిశ... అక్కడ ఉంచితే ఆర్థికంగా..ఈ వాస్తు చిట్కాలు పాటించండి..?

Vastu Shastram for Money : వాస్తు శాస్త్రము ప్రకారం, గృహ నిర్మాణం చేసేటప్పుడు వాస్తు చూసి నిర్మిస్తారు. అయితే, గృహం నిర్మించుటకు మాత్రమే కాదు, సంపదలను, ఆర్థికంగా శ్రేయస్సును పెంచడంలో ఈ సూచనలు మీ ఆర్థిక శ్రేయస్సును పెంచడంలో సహాయపడతాయి. మీ ఇంట్లో దిశా ప్రాముఖ్యత, పూజ గది స్థానం, కుబేర యంత్రం ప్రయోజనాల గురించి పూర్తిగా వివరించారు. ఇంకా కుబేర లక్ష్మి యోగం కలవాలంటే.. ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో అయితే దీపం ప్రతిరోజు వెలుగుతుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం మరియు కుబేర స్థానం ఉంటుంది. వాస్తు శాస్త్రాలను పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

Vastu Shastram for Money మీ ఇంట్లో ఈ దిశ కుబేర దిశ అక్కడ ఉంచితే ఆర్థికంగాఈ వాస్తు చిట్కాలు పాటించండి

Vastu Shastram for Money : మీ ఇంట్లో ఈ దిశ కుబేర దిశ… అక్కడ ఉంచితే ఆర్థికంగా..ఈ వాస్తు చిట్కాలు పాటించండి..?

వాస్తు శాస్త్రంలో దిశలకు, మూలాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంటి మూలాలలో ప్రత్యేక స్థానం ఉంది. అవి, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి, ఈశాన్య మూలాలు ఉంటాయి. వాయుమూల, అగ్ని మూల, ఇంకా, కుబేర మూల. కుబేరుడు సంపదలకు అధిపతి. కావున ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈశాన్యంలో పూజ గదిని ఏర్పాటు చేస్తే శుభప్రదం అని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బరువైన వస్తువులను ఉంచకూడదు. అయినా వస్తువులు అలిశలో ఉంచితే వాస్తు శాస్త్రంలో ఆర్థిక సమస్యలు వస్తాయని పేర్కొన్నబడింది. అంతేకాదు కుబేర యంత్రాన్ని ఇంట్లో ఏర్పాటు చేస్తే ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల ఆర్థికంగా శ్రేయస్సు మన కుటుంబానికి లభిస్తుందని నమ్మకం.

Vastu Shastram for Money ఆర్థిక సమస్యలను అధిగమించే మార్గాలు

ఆర్థికంగా మనము లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నిర్దిష్ట పనులు చేయటం వల్ల ఇంట్లో సంపదల వర్షం నిరంతరం పెరుగుతుంది. ఇంట్లో సిరి సంపదల కొరత లేకుండా ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలని,సలహా సూచనలను పాటించండి. వాస్తు శాస్త్రంలో కుబేరుడు సంపదకు అధిపతి, ఈయనకు ప్రసన్నం అవ్వాలి అంటే, ఇంట్లో ఆర్థిక సమస్యలు అధిగమించాలన్న, కుబేరుని యంత్రం రూపంలో పూజిస్తే ఈయనకు ప్రసన్నం అవ్వచ్చు. కొత్త ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఈశాన్య దిశలో ప్రత్యేక శ్రద్ధను పెట్టాల్సి ఉంటుంది. ఈ దిశలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటే చాలా మంచిది. ఈశాన్యంలో మెట్లు అసలు నిర్మించకూడదు, మెట్లు నిర్మించడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంకా అలాగే,చెప్పులు ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. అంతేకాదు ఈశాన్య దిశలో బాత్రూం నిర్మించకూడదు. బాత్రూం నిర్మించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది. డబ్బును తాకే సేఫ్ ఎల్లప్పుడూ ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. ఇలా చేయడం ఆర్థికంగా ప్రయోజనాలను కలుగజేస్తుంది. ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు మురికిగా ఉంటే, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి, సిరిసంపదలు పెరుగుతాయి.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది