Vastu Tips : ఇంట్లో పావురాల గూడు శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏమంటుంది తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Tips : ఇంట్లో పావురాల గూడు శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏమంటుంది తెలుసా?

 Authored By ramu | The Telugu News | Updated on :7 August 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Vastu Tips : ఇంట్లో పావురాల గూడు శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏమంటుంది తెలుసా?

Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం సాధించాలంటే వాస్తు నియమాలు పాటించాలన్న నమ్మకం ఉంది. ముఖ్యంగా కొన్ని జీవులు, పక్షులు ఇంట్లోకి రావడం శుభంగా భావిస్తే.. కొన్ని మాత్రం అశుభ సూచనలుగా పరిగణిస్తారు. పావురాలు కూడా ఈ లిస్టులో ఉన్నవే.

Vastu Tips ఇంట్లో పావురాల గూడు శుభమా అశుభమా వాస్తు శాస్త్రం ఏమంటుంది తెలుసా

Vastu Tips : ఇంట్లో పావురాల గూడు శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏమంటుంది తెలుసా?

Vastu Tips : ఎలా మంచిది ?

పావురం గూడు ఇంట్లో ఉంటే దురదృష్టమా? అంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పు, బాల్కనీలో పావురం గూడు కట్టుకుంటే అది అశుభ సూచనగా పరిగణిస్తారు.దాంతో ఇంట్లో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నమ్మకం.అందుకే చాలా మంది వాటి గూడును వెంటనే తొలగించేస్తారు. కానీ, మరోపక్క శుభ సూచనగా నమ్మేవాళ్లూ ఉన్నారు. కొంతమంది మాత్రం పావురాల రాకను శుభంగా భావిస్తారు.హిందూ పురాణాల్లో పావురాలను లక్ష్మీ దేవికి అత్యంత సమీపమైన పక్షులుగా పేర్కొన్నారు.

ఈ పక్షులు ఇంటిలో ఉండటం వల్ల సాంత్వన, ఆనందం, శాంతి వస్తాయని నమ్మకం ఉంది.పావురం గూడు తొలగిస్తే అదృష్టాన్ని దూరం చేస్తున్నట్టు అవుతుందన్న నమ్మకంతో వారివి జాగ్రత్తగా సంరక్షిస్తారు.పావురాలు ఎలా, ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నాయన్నదీ కీలకం!వాస్తు ప్రకారం రోజులో పావురం ఇంట్లోకి వచ్చే సమయం కూడా ఒక సంకేతం. ఉదయాన్నే పావురం ఇంట్లోకి వస్తే దాన్ని శుభ సూచనగా పరిగణిస్తారు. అదృష్టం, ఆర్ధిక లాభాలు తలుపుతట్టే అవకాశం. సాయంత్రం వస్తే ప్రేమ వ్యవహారాల్లో విజయాలు, వివాహ అవకాశాలు అందుతాయని నమ్మకం. రాత్రి వస్తే పనుల్లో ఆటంకాలు, నిర్ణయాల్లో గందరగోళం ఏర్పడే సూచనగా భావిస్తారు. వాస్తు ప్రకారం పావురాలు కుడివైపున నుంచి అకస్మాత్తుగా ఎగిరితే అది సోదరులు, బంధువులకు శుభం కాదని చెబుతారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది