Vastu Tips : ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా ముఖ్యం. డబ్బు ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. అందుకే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే డబ్బు కోసం పగలు రాత్రి కష్టపడుతుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు. సంపాదించిన డబ్బు వారు ఊహించని విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక ఈ విధంగా డబ్బు ఖర్చు అయ్యేవారు వాస్తు నియమాలను అనుసరిస్తే సంపాదించిన డబ్బులను కాపాడుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే వాస్తు శాస్త్రంలో కొన్ని చిట్కాలు తెలుపబడ్డాయి. ఇంట్లో ఎప్పుడూ డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుందని భావించేవారు ఏడు గవ్వలను శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచాలి. ఇది ఇంట్లో శ్రేయస్సుని తీసుకొస్తుందని డబ్బు కొరత ఉండదని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో కొన్ని వస్తువులను ఉంచడం వలన డబ్బు వస్తుంది. వీటిలో కొత్త నోట్లు కూడా ఉన్నాయి. కొత్త నోట్లు కట్టలోని ఒక నోటును ఇంటి లాకర్లో భద్రంగా ఉంచితే డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. నోట్లు పాతవి కాకుండా కొత్తవి పెట్టాలి. ధనానికి దేవుడు కుబేరు. కాబట్టి సంపదకు మూలమైన కుబేరుడు అనుగ్రహం పొందాలంటే కుబేరుడు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని లాకర్లో ఉంచడం మంచిది.
దీంతో డబ్బు రావడంతో పాటు లాభాలు పెరిగి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇంటి లాకర్లో చిన్న అద్దం ఉంచాలని చెబుతున్నారు. తలుపు తెరిచినప్పుడల్లా కనిపించే విధంగా అద్దాన్ని లాకర్లో ఉంచాలి. అప్పుడు ధనం రెట్టింపు అవుతుందని అంటున్నారు. అలాగే లక్ష్మీదేవికి నచ్చిన వస్తువులను, పనికిరాని వస్తువులను లాకర్లో పెట్టకూడదు. చాలామంది లాకర్లలో తాళం చెవులు, ఫోటోలు, ఇతర పత్రాలు, కొన్ని వస్తువులను పెడుతూ ఉంటారు. లాకర్లో ధనానికి సంబంధించిన వాటిని మాత్రమే పెట్టాలి. మరే వస్తువులను పెట్టకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఎంత సంపాదించిన డబ్బు నిలవడం లేదని బాధపడేవారు ఈ చిట్కాలను పాటించి చూడండి.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.