Vastu Tips : కుబేరుడు విగ్రహాన్ని ఈ ప్రదేశంలో పెట్టారంటే… ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తుంది…

Authored By aruna | The Telugu News | Published on: September 17, 2022, 6:00 am

Vastu Tips : ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా ముఖ్యం. డబ్బు ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. అందుకే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే డబ్బు కోసం పగలు రాత్రి కష్టపడుతుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు. సంపాదించిన డబ్బు వారు ఊహించని విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక ఈ విధంగా డబ్బు ఖర్చు అయ్యేవారు వాస్తు నియమాలను అనుసరిస్తే సంపాదించిన డబ్బులను కాపాడుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే వాస్తు శాస్త్రంలో కొన్ని చిట్కాలు తెలుపబడ్డాయి. ఇంట్లో ఎప్పుడూ డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుందని భావించేవారు ఏడు గవ్వలను శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచాలి. ఇది ఇంట్లో శ్రేయస్సుని తీసుకొస్తుందని డబ్బు కొరత ఉండదని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో కొన్ని వస్తువులను ఉంచడం వలన డబ్బు వస్తుంది. వీటిలో కొత్త నోట్లు కూడా ఉన్నాయి. కొత్త నోట్లు కట్టలోని ఒక నోటును ఇంటి లాకర్లో భద్రంగా ఉంచితే డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. నోట్లు పాతవి కాకుండా కొత్తవి పెట్టాలి. ధనానికి దేవుడు కుబేరు. కాబట్టి సంపదకు మూలమైన కుబేరుడు అనుగ్రహం పొందాలంటే కుబేరుడు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని లాకర్లో ఉంచడం మంచిది.

Vastu Tips for financial problems follow these tips

Vastu Tips for financial problems follow these tips

దీంతో డబ్బు రావడంతో పాటు లాభాలు పెరిగి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇంటి లాకర్లో చిన్న అద్దం ఉంచాలని చెబుతున్నారు. తలుపు తెరిచినప్పుడల్లా కనిపించే విధంగా అద్దాన్ని లాకర్లో ఉంచాలి. అప్పుడు ధనం రెట్టింపు అవుతుందని అంటున్నారు. అలాగే లక్ష్మీదేవికి నచ్చిన వస్తువులను, పనికిరాని వస్తువులను లాకర్లో పెట్టకూడదు. చాలామంది లాకర్లలో తాళం చెవులు, ఫోటోలు, ఇతర పత్రాలు, కొన్ని వస్తువులను పెడుతూ ఉంటారు. లాకర్లో ధనానికి సంబంధించిన వాటిని మాత్రమే పెట్టాలి. మరే వస్తువులను పెట్టకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఎంత సంపాదించిన డబ్బు నిలవడం లేదని బాధపడేవారు ఈ చిట్కాలను పాటించి చూడండి.

aruna

No bio available for this author.

  1. "Indiramma Houses : జవహర్‌నగర్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. వజ్రేష్ యాదవ్ డిమాండ్!"

  2. "Samantha Son : సమంత కొడుకు పేరు ‘దేవ్ నిడిమోరు’.. ఈ అందమైన పేరుకు అర్థం ఏంటో తెలుసా?"

  3. "Motakondur : మోటకొండూరును అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలి.. తహసీల్దార్‌కు వినతిపత్రం !"

  4. "Shadnagar Realtors Association : షాద్‌నగర్‌లో ఎన్నికల హీట్.. అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ!"

  5. "Gunde Ninda Gudi Gantalu Today Episode : సుమతి, అరుణ్ పెళ్లి కోసం మీనా సంచలన నిర్ణయం.. బాలు మాటలతో కన్నీళ్లు!"

  6. "Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!"

  7. "Nara Lokesh CM : ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్?.. సీఎంగా లోకేష్.. చంద్రబాబు పాత్ర ఏంటనే చర్చ!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp