Vastu Tips : దేవుడు గది విషయంలో తప్పులు చేస్తున్నారా… అయితే భారిగా నష్టపోతారు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vastu Tips : దేవుడు గది విషయంలో తప్పులు చేస్తున్నారా… అయితే భారిగా నష్టపోతారు..!!

Vastu Tips : ఇల్లు ని నిర్మించేటప్పుడు వాస్తు ప్రకారంగా నిర్మిస్తూ ఉంటారు. అలాగే పూజ గది విషయంలో కూడా ఎంతో పాటించవలసి ఉంటుంది. ఒకవేళ ఈ దేవుడి గది విషయంలో ఈ పొరపాట్లు చేస్తే. ఇక భారీగా నష్టపోతూ ఉంటారు. ఇంతకుముందు వాస్తు అంటే సరిగా పట్టించుకోని వాళ్ళు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు ఇల్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంట్లో వస్తువుల అమరికల వరకు ప్రతి విషయంలో వాస్తు విషయాన్నీ తప్పకుండా పాటిస్తున్నారు.. వాస్తు శాస్త్రంలో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 February 2023,7:00 am

Vastu Tips : ఇల్లు ని నిర్మించేటప్పుడు వాస్తు ప్రకారంగా నిర్మిస్తూ ఉంటారు. అలాగే పూజ గది విషయంలో కూడా ఎంతో పాటించవలసి ఉంటుంది. ఒకవేళ ఈ దేవుడి గది విషయంలో ఈ పొరపాట్లు చేస్తే. ఇక భారీగా నష్టపోతూ ఉంటారు. ఇంతకుముందు వాస్తు అంటే సరిగా పట్టించుకోని వాళ్ళు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు ఇల్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంట్లో వస్తువుల అమరికల వరకు ప్రతి విషయంలో వాస్తు విషయాన్నీ తప్పకుండా పాటిస్తున్నారు.. వాస్తు శాస్త్రంలో చెప్పబడిన నియమాలను చేయడం వలన మంచి జరగడంతోపాటు సానుకూల ఫలితాలు కూడా పొందుతారు. దీంతో చాలామంది వాస్తు శాస్త్రాన్ని విపరీతంగా నమ్ముతూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లోని దేవుడు గది ఎప్పుడు కూడా ఈశాన్యం లేదా ఉత్తర దిశలలోనే అమరుస్తూ ఉంటారు.

Vastu Tips Is God making mistakes about the room

Vastu Tips Is God making mistakes about the room

ఆ విధంగా ఉత్తర ఈశాన్యం దిశలోనే ఉంచితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆర్థిక లాభం పొందవచ్చు. ఒకవేళ పూజగది వాస్తు ప్రకారం నిర్మించకపోతే కుటుంబంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దేవుడు గది వాస్తు ప్రకారం గా ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పూజ చేసే ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరగడం మొదలవుతుంది. అలాగే ఇంట్లో కట్టుకున్న గుడి వాస్తుకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఉంటే పూజ చేసేటప్పుడు మనసు ఏకాగ్రతతో అసలు ఉండదు. పూజ చేయడం వలన ప్రయోజనం కూడా ఉండదు. అదేవిధంగా ఆ ఇంటికి దరిద్ర దేవత ఆహ్వానించినట్లే.. అయితే దేవుని గది విషయంలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు గురించి ఇప్పుడు మనం చూద్దాం…

వాస్తు ప్రకారం దేవుడి గదిలో ఎప్పుడు విరిగిన విగ్రహాలను పెట్టి పూజించకూడదు. ఇది ముఖ్య మైనది. అలాగే విగ్రహాలకు పూజిస్తే దేవతలకు కోపం వస్తుంది. వాస్తు ప్రకారం పూజ గది ఎప్పుడు స్టోర్ రూమ్, బెడ్ రూమ్, బేస్మెంట్లో నిర్మించకూడదు.దేవుడి గది సరియైన దిశలో లేకపోతే పూజలకు ఉపయోగముండదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. కావున దేవుడి గది ఎప్పుడు ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్యం వైపు నిర్మించుకోవాలి. వాస్తు ప్రకారం పూజగదికి పడమర దిశ అశుబంగా ఉంటుంది.. అదేవిధంగా ఇంటి గుడిలో రెండు శంఖాల కలిపి ఉంచడం మంచిది కాదు.

Vastu Tips Is God making mistakes about the room

Vastu Tips Is God making mistakes about the room

అలాగే వాస్తు ప్రకారం ఇంట్లోని పూజ గదిలో ఒకటికంటే ఎక్కువ దేవుడి చిత్రాలను పెట్టకూడదు. అదేవిధంగా మూడు వినాయక విగ్రహాన్ని ఉంచకూడదు. గుర్తుంచుకోండి. ఈ విధంగా ఉండటం వలన ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు వస్తుంటాయి. దేవుడి గదిలో హనుమాన్ విగ్రహం ఎల్లప్పుడూ చిన్నదిగా ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం పొరపాటున కూడా గుడి దగ్గర టాయిలెట్ల నిర్మించకూడదు.. చాలాసార్లు ఇంట్లో వంట గదిలోనే పూజ గదిని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం వంటగదిలో కూడా ఈ పూజ గది అనేది నిర్మించకూడదు. ఈ విధంగా చేయడం వలన ధనలక్ష్మికి ఆగ్రహం వస్తుంది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది