Vastu Tips : నెమలి ఈకను ఇంట్లో ఈ దిశగా ఉంచితే అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Tips : నెమలి ఈకను ఇంట్లో ఈ దిశగా ఉంచితే అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లే…!!

 Authored By ramu | The Telugu News | Updated on :25 November 2024,8:00 am

Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది. అంతేకాదు కొన్ని జంతువులు మరియు పక్షులు దేవతలకు వాహనాలుగా ఉన్నాయి. ఆ వాహనాలలో ఒకటి నెమలి. నెమలి అందమైన పక్షి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు అలంకరణలో ఒక భాగం. ఈ క్రమంలోనే నెమలి ఈకలు వాస్తు శాస్త్రంలో పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం వలన అనేక రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నెమలి ఈకలను ఇంట్లో ఉంచడం వలన వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటుగా కుటుంబంలో సుఖ సంతోషాలు సంపదలు ఐశ్వర్యం ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

– రెండు నెమలి ఈకలను ఇంటి పూజా గదిలో ఉంచడం వలన వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి…

– ఇంట్లో నెమలి ఈకలను పెట్టుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది.

– ఇంటి ప్రధాన ద్వారం తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో లేకపోవడం మరేదైనా వాస్తుదోషం ఉన్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారం తలుపు ప్రేమ్ ఫై కూర్చుని ఉన్న వినాయకుడిని ప్రతిష్టించండి. ఇక ఆ వినాయకుడు బొమ్మ పై మూడు నెమలిక లను ఉంచండి.

Vastu Tips నెమలి ఈకను ఇంట్లో ఈ దిశగా ఉంచితే అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లే

Vastu Tips : నెమలి ఈకను ఇంట్లో ఈ దిశగా ఉంచితే అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లే…!!

– ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం శుక్ల పక్షంలో ఆగ్నేయ మూలలో ఐదు అడుగుల ఉన్న రెండు నెమలి ఈకలను పెట్టడం ద్వారా ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

– ఇంట్లోనే డైనింగ్ రూమ్ మరియు డ్రాయింగ్ రూమ్ లో కనీసం 11 లేదా 15 నెమలి ఈకలను పెట్టడం వల్ల పరస్పర సమరస్యం మెరుగుపడుతుంది. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది.

– నెమలి ఈకలు ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తాయి. కనుక నెమలి ఈకలు పెట్టిన ప్రాంతంలో ఎటువంటి క్రిములు ఉండవు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది