Vastu Tips : మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఇబ్బందులు తప్పవట.. మీ ఇంట్లో ఉంటే తీసేయండి…!
Vastu Tips : చాలామంది ఇంట్లో డెకరేషన్ కోసం కొన్ని రకాల పూల మొక్కలను అలాగే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు. అయితే అలాంటి మొక్కలలో కొన్ని మొక్కలు ఆర్థిక ఇబ్బందులకు అలాగే కుటుంబ ప్రశాంతతను పోగొడతాయంట. అలాగే కొన్ని సమస్యలు కూడా వస్తాయట. అందుకని కొన్ని మొక్కలను ఇంటి ముందు నాటకూడదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.. మొక్కలకు వాస్తు టిప్స్ : ఆకుపచ్చ కలర్ శ్రేయస్సుకి గుర్తు. అయితే ఈ మొక్కలు ఇంట్లో ఉండడంవల్ల స్వచ్ఛమైన గాలితోపాటు అనేక శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అయితే దీనికి విరుద్ధంగా కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పేదరికం వచ్చేలా చేస్తాయి. ఇంటిని నాశనం అయ్యేలా చేస్తూ ఉంటాయి. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉండటం వలన చెడు జరుగుతుందని తెలియజేస్తున్నారు.
వాస్తు నిపుణులు. అలాంటి మొక్కలు ఏమిటో ఇంట్లో అవి ఉంటే ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయో చూద్దాం… ఆకుపచ్చ కలరు ఆనందానికి గుర్తు పచ్చని మొక్కలు కళ్ళకు ఉత్సాహాన్ని ఇస్తాయి. మనసుకి హాయిని పరుస్తాయి. మొక్కలు ఇంట్లో నాటడం వలన ఇంటి అందం కూడా ఎక్కువవుతుంది. అలాగే ఇంట్లో ఫాస్ట్ ఎనర్జీ నీక్కూడా పెంచుతుంది. అలాగని దొరికిన మొక్కలన్నిటిని ఇంటికి తెచ్చుకుంటే చెడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. వాస్తు ప్రకారంగా ఇంట్లో ఎలాంటి మొక్కలు నాటుకోవాలి. ఎలాంటి మొక్కలు కి దూరంగా ఉండాలో, కొన్ని మొక్కలు ఇంట్లో ఉండడంవల్ల దుష్టశక్తులు ఇంట్లోకి వచ్చి ఇంటి నాశనం చేస్తాయని చెప్తున్నారు. దానివల్లనే కొన్ని మొక్కలు ఇంట్లో పెంచకూడదు అని చెప్తున్నారు. అవేంటో వాటిని చూద్దాం.. ఇలాంటి మొక్కలు ఇంటి ముందు పెంచడం కుటుంబాన్ని నాశనం చేయడానికి దోహదపడతాయి..
చింత చెట్టు : వాస్తు ప్రకారం గా కుటుంబ సభ్యులు ఉండే ఇంటిదగ్గర చింత చెట్టు ఎప్పుడూ ఉండకూడదు. చింతపండు ఇంటి సభ్యుల మధ్య విభేదాలను తెస్తుంది. అలాగే తరచుగా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను చేయబడుతుంది. కావున ఇంటి ముందు చింత చెట్టుని అస్సలు పెంచకూడదు…
ఖర్జూరం మొక్క : ఖర్జూరం ఆరోగ్యానికి మంచిది. అయినప్పటికీ భారతీయ సంస్కృతిలో ఇది చాలా చెడు ప్రభావాలను చూపిస్తుంది. కాబట్టి వాస్తు ప్రకారం గా ఖర్జూరం చెట్టుని ఇంటి ముందు నాటడం వలన కుటుంబానికి అన్ని ఆ శుభాలే జరుగుతాయి. అలాగే కుటుంబ సభ్యులకు తరచూ ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు తెలియజేయడం జరిగింది.
ముళ్ళ మొక్కలు : ముళ్ళ మొక్కలను ఇంటిముందు ఎప్పుడు నాటకూడదు. ఉదాహరణకి కాక్టస్ మొక్క నిమ్మ మొక్క గులాబీ మొక్క ఇవన్నీ ఎప్పుడు ఇంటిముందు లేదా ఇంటి లోపల నాటకూడదు. ముళ్ళు ద్వేషం కలహాలకి గుర్తు ఇలాంటి మొక్కలు ఉండడం వలన కుటుంబంలో మనస్పర్ధలు కలహాలు వచ్చి కుటుంబమే నాశనం అవుతుంది. కావున ఇంటి ముందు ఇటువంటి మొక్కలను నాటడం మంచిది కాదు…