Shravana Masam 2025 : శ్రావణమాసంలో స్త్రీలు ఎక్కువగా ఆకుపచ్చ చీరలు, గాజులు ఎందుకు ధరిస్తారు… శాస్త్రీయ కోణం ఏమిటి..?
ప్రధానాంశాలు:
Shravana Masam 2025 : శ్రావణమాసంలో స్త్రీలు ఎక్కువగా ఆకుపచ్చ చీరలు, గాజులు ఎందుకు ధరిస్తారు... శాస్త్రీయ కోణం ఏమిటి..?
Shravana Masam 2025 : మహిళలు ఎంతో ఇష్టంగా శ్రావణమాసంలో ఆధ్యాత్మిక తో భావంతో నిండి,పూజలను చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో మహిళలు ఎక్కువగా వరలక్ష్మీ వ్రతాన్ని, మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం కోసం నోములు, వ్రతాలని చేస్తుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రావణమాసంలో ఈ వ్రతాలు చేసేటప్పుడు ఎక్కువగా ఆకుపచ్చ రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తుంటారు. ఆకుపచ్చ గాజులకు కూడా ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. ఈ సమయంలో ఆకుపచ్చ దుస్తులు సాంప్రదాయం శతాబ్దాలుగా వస్తూ ఉంది.దీని వెనుక అసలు కారణం ఏమిటో మీకు తెలుసా.. అలాంటి పరిస్థితుల్లో శ్రావణమాసానికి ఆకుపచ్చ రంగుతో ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం…

Shravana Masam 2025 : శ్రావణమాసంలో స్త్రీలు ఎక్కువగా ఆకుపచ్చ చీరలు, గాజులు ఎందుకు ధరిస్తారు… శాస్త్రీయ కోణం ఏమిటి..?
శ్రావణమాసం రాగానే ఆధ్యాత్మిక వాతావరణం నిండుకొని ఉంటుంది. ఈ శ్రావణమాసంలో శివ కేశవులతోపాటు వరలక్ష్మి,మంగళ గౌరీ వ్రతాలను, పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ శ్రావణమాసంలో పూజలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని చెబుతుంటారు. ఈ నెలలో సోమవారం, మంగళ, శుక్రవారంలో ఉపవాసం ఉంటారు. ఈ శ్రావణ మాసంలో అనుసరించే పూజలు సాంప్రదాయాలలో ఒకటి. ఆకుపచ్చని దుస్తులు ధరించడం, ఆకుపచ్చ గాజులను వేసుకోవడం. స్త్రీలు ఆకుపచ్చ రంగు బట్టలను గాజులతో అలంకరించుకొని కనిపిస్తూనే ఉంటూ ఉంటారు. దీని వెనుక గల ఆశలు కారణం తెలుసుకుందాం…
Shravana Masam 2025 అసలు ఆకుపచ్చ రంగులే ఎందుకు ధరిస్తారు
శ్రావణ మాసంలో ఎక్కువగా మహిళలు ఆకుపచ్చ రంగులకి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. కంటే శ్రావణమాసానికి సంబంధం గా వర్షాకాలం ఉంటుంది. కురిసే వర్షాలు కారణంగా ప్రతి చోట పచ్చదనంతో నిండి ఉంటుంది. ప్రకృతిలో పచ్చదనం, కొత్త జీవితం, సంతానోత్పత్తిని కూడా విశ్వసిస్తుంది. కాబట్టి, మహిళలు కూడా శ్రావణమాసంలో తమ జీవితంలో కొత్త శక్తి, ప్రేమ,శ్రేయస్సు కలగాలని భక్తితో కోరికలు కోరుతూ కొత్త జీవితానికి శక్తికి చిహ్నంగా ఆకుపచ్చ రంగులో తమను తాము అలంకరించుకుంటారు. దీంతోపాటు ఆకుపచ్చ రంగును వైవాహిక ఆనందానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు వివాహిత మహిళలకు తమ భర్తల దీర్ఘాయుష్షు అదృష్టం కోసం ఆకుపచ్చ గాజులను ధరిస్తూ ఉంటారు. నిండు ముత్తయిదువుగా నిండు నూరేళ్లు ఉండాలని భావిస్తూ ఆకుపచ్చని గాజులను ధరిస్తారు.
Shravana Masam 2025 పార్వతీ దేవికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం
అయితే పురాణాలు ఏమి చెబుతున్నాయి అంటే పార్వతీదేవికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టమట. బట్టి శ్రావణమాసంలో శివపార్వతులను ప్రత్యేకంగా పూజిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఆకుపచ్చ గాజులు ఆకుపచ్చ బట్టలు ధరిస్తే దేవతల అనుగ్రహం కలుగుతుందని అంతులేని అదృష్టం కలుగుతుందని కూడా భావిస్తారు. ఆకుపచ్చ రంగు శుభానికి సంకేతం. ఇంకా, శాంతి, శ్రేయస్సుకు కూడా చిహ్నంగా భావిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రంగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.అలాగే ఈ రంగును ధరించటం వల్ల వాతావరణంలో సానుకూల శక్తి ప్రసరింపబడుతుంది. మనసుకు శాంతి కూడా కలుగుతుంది.
Shravana Masam 2025 ఈ రంగుల వెనక ఉన్న శాస్త్రం ఏమిటి
ఈ ఆకుపచ్చ రంగుల వెనుక ఉన్న శాస్త్రం అమతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తో పాటు, ఆకుపచ్చ రంగుకు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది. అయితే,ఆయుర్వేదం చికిత్స ప్రకారం ఆకుపచ్చ రంగుకు ఒత్తిడి కూడా తగ్గుతుంది. హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో కూడా సహకరిస్తుంది.