Pooja Things : మీరు చేసే పూజలో… ఈ 4 వస్తువులు ఎంత పాతబడిన సరే… మళ్లీ వినియోగించవచ్చట…?
ప్రధానాంశాలు:
Pooja Things : మీరు చేసే పూజలో... ఈ 4 వస్తువులు ఎంత పాతబడిన సరే... మళ్లీ వినియోగించవచ్చట...?
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు. పూజలు చేసే సమయంలో కొన్ని వస్తువులు పాతవి అయిపోయాయని పూజ చేసే ప్రతిసారి కొత్త వస్తువును కొంటూ ఉంటారు. ఈ నాలుగు వస్తువులు మాత్రం, ఎంత పాత అయినా సరే మరల తిరిగి వినియోగించవచ్చు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. మరి ఏంటో తెలుసుకుందాం. మతంలో ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికతతో నిండి పూజలు చేస్తూ ఉంటారు. చేసే విషయాలను కొన్ని నియమాలను కూడా పాటించాలని చెబుతారు. ఆ దేవాది దేవతలు మనపై అనుగ్రహాన్ని చూపిస్తారు.నియమ నిబంధనలతో పూజలు ఆచరించే వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని నమ్మకం. అయితే చాలామంది పూజలు చేసే విధానంలో కొన్ని వస్తువులను మరలా వాడకూడదని భావంతో కొత్త వస్తువులను కొంటూ ఉంటారు. కానీ ఈ నాలుగు వస్తువులను మాత్రం ఇంత పాతబడిన సరే వినియోగించవచ్చు అంటున్నారు. రోజుకు అవసరమైన సామాగ్రిలో కొత్త కొనుగోలు చేసే వారు ఈ నాలుగు వస్తువులు మాత్రం ఎప్పటికీ వాడుకోవచ్చు అని చెబుతున్నారు. వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

Pooja Things : మీరు చేసే పూజలో… ఈ 4 వస్తువులు ఎంత పాతబడిన సరే… మళ్లీ వినియోగించవచ్చట…?
Pooja Things గంగాజలం
స్కంద పురాణంలో గంగాజలం, ఎప్పుడూ కూడా బాధపడదని పేర్కొంటున్నారు.ఎన్ని ఏళ్ల తరబడి నా సరే ఇంట్లో ఉంచుకోవచ్చు. మీరు తిరిగి దాన్ని శుద్ధి చేయాలను కోసం కూడా వినియోగించుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా గంగాజలం చెడిపోదని చెబుతున్నాయి పురాణాలు.
బిల్వపత్రం : బిల్వపత్రాలు గ్రంధాలలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. శివయ్య ఎంతో తో ప్రీతికరమైనవి. బిల్వపత్రాన్ని ఒక్కసారి సమర్పించిన మరోసారి అదే పత్రాలు శుద్ధి చేసి కూడా సమర్పించవచ్చట. శివయ్యకు ఇష్టమైన బిల్వపత్రాన్ని ఆయనకు సమర్పిస్తే ఆయనను ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతున్నాయి పురాణాలు. ఆయుర్వేదంలో కూడా బిల్వ పత్రాన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఉపయోగిస్తున్నారు.
తమర పూలు : పూజలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మనందరికీ తెలుసు. పువ్వు లేని పూజా వ్యర్థం అంటారు. ప్రకృతి ఇచ్చే ఈ పువ్వులను దేవునికి సమర్పిస్తే దేవుళ్లు ఎంతో సంతోషిస్తారు. శాస్త్రంలో మాత్రం పాత పువ్వులను సమర్పించడం సిద్ధంగా ప్రకటించారు. మిగతా పూల కంటే కూడా ఈ నియమం తామర పువ్వుకు మాత్రం నిషిద్ధం అని వర్తించలేదు. తామర పువ్వు ఒకసారి వాడిన తరువాత కడిగి మళ్లీ దేవుళ్ళకి అర్పించవచ్చట. తామర పువ్వు కూడా ఒకసారి సమర్పించిన తర్వాత మళ్లీ ఒకసారి పూజలో వినియోగించవచ్చని జ్యోతిష్య పండితులు, ఇంకా వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
తులసి ఆకులు : మన హిందూ మత విశ్వాసాల ప్రకారం భక్తులు పూజలు తామర పువ్వుని గంగాజలాన్ని విలువ పత్రాలని ఎలా అయితే ఎక్కువ రోజులు అయినా సరే వాడుతారు. అలాగే వీటితో పాటు తులసి ఆకులు కూడా ఎంతో పవిత్రమైనవి. వీటిని కూడా పాతబడిన సరే తిరిగి మరలా పూజలో వినియోగించవచ్చట. తులసి ఆకులను కూడా శుద్ధి చేసి మల్లె తిరిగి పూజలో వినియోగించవచ్చు విష్ణు పూజలు తులసీ తప్పనిసరిగా వినియోగించాలి. కొత్త ఆకులు దొరికితే పర్వాలేదు, లేకుంటే వాడిన ఆకులు ఉన్న పూజలో వాటిని శుభ్రం చేసి తిరిగి మళ్ళీ వాడవచ్చు. మొదట దేవుళ్లకు వినియోగించిన తులసి ఆకులను పడేయకండి పారే నీటిలో వేయాలి. ఎక్కడపడితే అక్కడ వేయకూడదు. గోవు దొక్కనిచోట పూజ పూలను వెయ్యాలి.పూజకు ఉపయోగించిన సామాగ్రిని పారె నీటిలో వేయాలి.అదే శుభప్రదం.