Varalakshmi Kataksham : శ్రావణమాసంలో వరలక్ష్మి కటాక్షం… ఈ రాశుల వారి పైనే.. వీరు తప్పక వ్రతం చేయండి…?
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి కూడా ఈ శ్రావణ మాసం అంటే ఎంతో ప్రీతి. మాసంలో లక్ష్మీదేవిని పూజించి వరలక్ష్మి దేవి వ్రతాన్ని ఆచరిస్తే సౌభాగ్యం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు,ఆయురారోగ్యాలు కలుగుతాయని భావించి భక్తితో పూజలు చేస్తారు. అలాగే శ్రావణమాసంలో బృహస్పతి, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని ప్రధానంగా చేస్తున్న సంచారం కారణము వలన కొన్ని రాశుల వారికి,ముఖ్యంగా,ఈ శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిబంధనలో పేర్కొంటున్నారు.
శ్రావణంలో శుభయోగాలు : వనమాసంలో గ్రహాల సంచారం కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి వాటిలో మాలవ్య రాజయోగం గజలక్ష్మీ రాజయోగము ఎంతో ముఖ్యమైనవి. ఈ రాజయోగాలు కారణంగా కూడా శ్రావణం కొన్ని రాశులను అదృష్ట జాతకులుగా మార్చబోతుంది. మరి ఆ అదృష్ట జాతకులు ఎవరో తెలుసుకుందామా..
కర్కాటక రాశి : ఈ రాశి జాతకులు శ్రావణమాసం ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. వీరి సంపాదన విషయానికొస్తే వీరికిగా తిరుగులేదు.ఏ పనిచేసిన కూడా విజయాలను పొందుతారు. అంతేకాక, సరైన నిర్ణయాలు తీసుకుంటే సమాజంలో వీరికి గౌరవ,మర్యాదలు కూడా పెరుగుతాయి.

Varalakshmi Kataksham : శ్రావణమాసంలో వరలక్ష్మి కటాక్షం… ఈ రాశుల వారి పైనే.. వీరు తప్పక వ్రతం చేయండి…?
మిధున రాశి : ఈ రాశి వారికి శ్రావణమాసం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు. వీరు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి.వీరికి ధనయోగం కూడా ప్రాప్తిస్తుంది. వీరికి ఊహించని విధంగా డబ్బులు చేతికి అందుతాయి. పనిచేసే చోట, వృత్తి, ఉద్యోగాలలో వీరికి ఉన్నత స్థానాలు చేరుకుంటారు. అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. తోటి ఉద్యోగులతో సహకారం లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగాలు చేయాలనే కోరిక ఉన్న వారికి ఇది సరైన సమయమని చెప్పవచ్చు. సమయాలలో సరైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి శ్రావణమాసం కూడా కలిసి వస్తుంది. ధనస్సు రాశి జాతకులు పోయే పని చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు కూడా అందుతాయి. ప్రేమలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారికి అంతా శుభసమయమే.