Venu Swamy : “మేష రాశి వారి జాతకం అదుర్స్ .. ఏప్రిల్ నుంచి మీకు తిరుగులేదు ” ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : “మేష రాశి వారి జాతకం అదుర్స్ .. ఏప్రిల్ నుంచి మీకు తిరుగులేదు ” ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :23 February 2023,11:40 am

Venu Swamy ; ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలతో వైరల్ అవుతూ ఉంటారు. ఇటీవల స్టార్ సెలబ్రిటీస్ జాతకం గురించి ఓపెన్ గా చెప్పేశారు. దీంతో ఆయన చాలా పాపులర్ అయ్యారు అలాగే ఆయన చెప్పినవి కూడా ఖచ్చితంగా జరిగాయి. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వేణు స్వామి మేషరాశి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న గురు గ్రహ సంచారం జరగబోతుంది. దీంతో మేష రాశి వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. అందుకే వేణు స్వామి మేషరాశి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న గురుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

Venu Swamy comments about Aries

Venu Swamy comments about Aries

అలాగే శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు మార్పుల వలన మేష రాశికి మంచి జరగబోతుంది. ఈ మేష రాశి వారికి గురువుకు సంబంధించి, శనికి సంబంధించి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఇలా అందరికీ విశేష యోగ ఫలం కలగనుంది. ఏప్రిల్ వరకు 80% , 90% స్పీడ్ వరకు వెళ్లే మేష రాశి వారి జాతకం ఏప్రిల్ 23 నుండి 100% స్పీడుతో దూసుకెళుతోంది. ఎందుకంటే గురువు మేషం లోకి వస్తున్నాడు కాబట్టి.

Venu Swamy comments about Aries

Venu Swamy comments about Aries

మేషరాశి జాతకులకు చాలా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇలాంటి ఆనందకరమైన పరిస్థితి మేష రాశి వారికి ఈ మధ్యకాలంలో రాలేదు అని చెప్పుకోవచ్చు. అంత ఆనందకరమైన పరిస్థితి, పాజిటివ్ ఎనర్జీ ఈ సంవత్సరం మేషరాశి వారికి కలగబోతుంది. మేష రాశి వారికి రెండున్నర సంవత్సరాల దాకా తిరుగు లేదని చెప్పవచ్చు. శని పరంగా, గురుపరంగా మేషరాశి వారికి చాలా అనుకూలంగా డబోతుంది. రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా ఇలా అన్ని విధాలుగా మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. అన్ని రాశులలో మేషరాశికి ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది