Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు... ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం...?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక నక్షత్రం ఎంతో ఇష్టమైన నక్షత్రం ఇంకా జన్మ నక్షత్రం కూడా.ఈ నక్షత్రమే ఆరుద్ర నక్షత్రం. రాక్షసులకు గురువు నవగ్రహాలలో కీలక గ్రహమైన శుక్రుడు,జులై 26న మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.ఈనెల 1వ తేదీన ఆరుద్ర నక్షత్రంలోకి సంచారము చేశాడు. శుక్రుడు సంపదకు కారకుడు. శుక్రుని అనుగ్రహం ఉంటే సిరిసంపదలు కలుగుతాయి. సంతోషం, ఆనందం, విలాసవంతమైన జీవితం కలుగుతాయి. ఆరుద్ర నక్షత్రం లోనికి శుక్రుడు ప్రవేశించుటవలన ఏ రాశుల వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయో, ధనలక్ష్మి ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం …

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు... ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం...?

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam మిధున రాశి

మిధున రాశి వారికి ఈ శుక్రుని అనుగ్రహం చేత వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. వాక్చాతుర్యంతో మంచి మాటలుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. వ్యక్తిగత జీవితం కూడా సాఫీగా సాగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయగలుగుతారు.ప్రేమ జీవితంలో ఉన్నవారు అనుకూలంగా ఉంటుంది. వివాహం కానీ వారికి ఈ సంవత్సరం వివాహమవుతుంది. వృత్తిపరమైన జీవితంలో ఆర్థిక లాభాలను కూడా చవిచూస్తారు.

సింహరాశి : ఆరుద్ర నక్షత్రం శుక్రుడు ప్రవేశించడం చేత ఈ రాశి వారికి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి గతంలో పెట్టిన పెట్టుబడులకు భారీగా రాబడి వస్తుంది. మీరు ఏ పని చేయాలన్నా తీసుకునే నిర్ణయం ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. శక్తి సోమర్థ్యాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. ఒంటరిగా ఉన్న వ్యక్తులు దాంపత్య జీవితంలోకి ప్రవేశిస్తారు. సంపన్నుల కుటుంబాలతో వివాహాలు కుదురుతాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు.వారి నుంచి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి.

తులారాశి : సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కీర్తిప్రతిష్టలు కలుగుతాయి ఊహించిన విధంగా వీరికి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తిని చూపుతారు.ధార్మిక కార్యక్రమాలను కుటుంబ సభ్యులతో కలిసి చేస్తారు. కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే సమయం. ఇది ఉద్యోగస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. దాంపత్య జీవితం చాలా సజావుగా సాగుతుంది ఎటువంటి సమస్యలు అయినా సరే త్వరగా పరిష్కరించబడతాయి. ఆగస్టు నెలలో ఈ రాశి వారికి ఎంతో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు.

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి