Devotional : ధనప్రాప్తి, మనశ్శాంతి ఇంకా ఈ మొక్క వల్ల ఎన్నో లాభాలు.. కనిపిస్తే వదలొద్దు
Devotional : చాలా మంది రెండు ప్రధాన కారణాల వల్ల జీవితాన్ని ఆస్వాదించలేకపోతారు. ఒకటి ధనప్రాప్తం లేకపోవడం, ఇక రెండవది మనశ్శాంతి కొరవడటం. ధనం ఉన్న వారి దగ్గర మనశ్శాంతి ఉండదని చాలా మంది చెబుతారు. అలాంటి వారికి ఎక్కువగా టెన్షన్స్ ఉంటాయని అంటారు. డబ్బున్న వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండకపోయినా… మెదడును మాత్రం నిత్యం పని చేయిస్తూనే ఉండాలి. శరీరకంగా కష్టపడే వారు కేవలం రోజులో కొన్ని గంటలు మాత్రమే కష్టపడతారు. తర్వాత రెస్ట్ తీసుకుంటారు. కానీ మెదడును వాడే వారు నిరంతరం ఆలోచిస్తూనే ఉండాలి. పడుకున్నా ఆ ఆలోచనలు వదిలిపెట్టడం కుదరదు. అందుకే మనశ్శాంతి ఉండదని అంటారు. ఇక మనశ్శాంతి ఉన్న వారికి ధనం ఉండదని అందరూ చెప్పేమాట. ఇవి రెండూ ఉండాలంటే ఈ చిన్న చిట్కా పాటించి చూడండి మంచి ప్రయోజనం ఉంటుంది.
గరుడ వర్ధనం లేదా నందివర్ధనం మొక్కను ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల సుఖ శాంతులు కలుగుతాయని అంటారు. ధనప్రాప్తి కలగడంతో పాటు ఏ పని తలపెట్టినా విజయం చేకూరుతుంది. గరుడ వర్ధనం పూలు తెలుపు రంగులో ఉంటాయి. ఐదు రెక్కలతో ఉంటాయి నంది వర్ధనం పూలు. గరువ వర్ధనం పుష్పాలు సువాసనలు వెదజల్లుతాయి. ఈ పూలను ఎక్కువగా శివయ్యకు సమర్పిస్తారు. శివారాధనకు ఎక్కువగా నంది వర్ధనం పూలనే వాడతారు. నందివర్ధనం పూలతో శివునికి, గరుడ వర్ధనం పూలతో విష్ణువుకి పూజ చేస్తారు. దైవారాధనకే కాకుండా ఈ చెట్టు ఆయుర్వేదంలోనూ విరివిగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు యొక్క ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. పంటి నొప్పికి ఈ చెట్టు వేర్లను, వేళ్లపై బెరడును ఉపయోగిస్తారు. నందివర్ధనం లేదా గరుడ వర్ధనం పూలు కంటి అలసటను తగ్గించి కంటి నరాలకు బలాన్ని ఇస్తాయి. గరుడ వర్ధనం పువ్వు లు రెండు తీసుకొని నీటిలో ముంచి కళ్ళపై పెట్టుకుని కాసేపు రిలాక్స్ అవ్వడం వల్ల పని ఒత్తిడి వల్ల కలిగే అలసట తగ్గుతుంది.
ఈ చెట్ల నుండి వచ్చే పాలను గాయాలు లేదా పుండ్ల మీద అప్లై చేస్తే గాయాలు, పుండ్లు తగ్గిపోతాయి. తలనొప్పి, కంటి నొప్పులు ఉన్నట్లయితే ఈ ఆకుల రసాన్ని తీసి కొబ్బరి నూనెలో కలిపి తల నుదురు భాగంలో రాస్తే తలనొప్పి, కంటి నొప్పులు తగ్గుతాయి. కాళ్ళ పై ఉండే పుండ్లు నొప్పి తగ్గాలంటే ఆకుల రసాన్ని తీసి అప్లై చేస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ ఆకులు నీటిలో వేసి మరిగించి వడకట్టి చల్లారాక కళ్ళు కడుక్కుంటే కళ్ళు దురదలు, నొప్పులు తగ్గుతాయి. ఎలుక లేదా పంది కుక్క కరిచిన విషాన్ని పోగొట్టడానికి నందివర్ధన బెరడు, నందివర్ధన పువ్వులు వేసి మరిగించిన నీటిని నాలుగు చెంచాల చొప్పున వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల విషం పోతుంది.