Ananthapuram.. బాధ్యతగా మొక్కల పెంపకం చేపట్టాలి
జిల్లాలోని కదిరి మున్సిపల్ పరిధిలో కదిరి శాసన సభ్యుడు డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి సోమవారం పర్యటించారు. ఎనిమిదో వార్డు ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మొక్కను నాటారు. ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల ఉద్యమంగా సాగాలని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లందరూ బాధ్యత తీసుకుని వీలైన అన్ని చోట్ల మొక్కలు నాటాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వైసీపీ సర్కారు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా వాటి పర్యవేక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతీ ఒక్క కౌన్సిలర్ బాధ్యతగా మొక్కల పెంపకం చేపట్టాలని, ఓన్లీ మొక్కలు నాటడంతోనే పని అయిపోయిందనుకోవద్దని వాటి పెంపకం బాధ్యత కూడా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.