plant : మీ చుట్టుపక్కల ఉండే ఈ మొక్క గురించి మీకు తెలిస్తే.. వెంటనే ఆ మొక్కను తెచ్చి పెంచుకుంటారు…!
Plant : మన చుట్టూ ఆవరణలో ఎన్నో మొక్కలను మనం చూస్తూ ఉంటాం.. కానీ ఆ మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న సంగతి చాలామందికి తెలియదు.. రోడ్డు పక్కన నిత్యం ఎన్నో రకాల పూల మొక్కలను చూస్తూనే ఉంటాం. తలలో పెట్టుకునే పూలు మాత్రమే మనం పూల మొక్కలుగా అనుకుంటూ ఉంటాం. ఇక మిగతా మొక్కలు అన్నిటిని పెద్దగా పట్టించుకోము. అయితే ప్రకృతి ప్రసాదించిన ప్రతి మొక్కలను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి మనకి గుర్తే ఉండదు. మొక్కలు ,గింజలు వాటి పండ్లు ,పువ్వులు ఇలా మొక్కలలో ఏదో ఒక భాగం మానవుడికి ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఆ విధంగా ప్రకృతిలో అందమైన మొక్కగా పేరు ఉందని మొక్క బిల్లగన్నేరు మొక్క ఈ మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
దీనిని ఆయుర్వేదంలో కూడా ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. ఈ బిళ్ళ గన్నేరు మొక్కతో పూలతో మనకి ఎన్నో రకాల ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆకులు, పువ్వులు, మొక్క వేర్లు ఎన్నో వ్యాధుల్ని తగ్గిస్తాయి. క్యాన్సర్, మధుమేహం లాంటి వ్యాధులకు ఈ మొక్క చాలా బాగా సహాయపడుతుంది.
అయితే బిళ్ళ గన్నేరు మొక్క వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం..
దురద, దద్దుర్లు కీటకాలు, పురుగులు కుట్టిన చోట దురద ,దద్దుర్లు ఉంటే ఆ ప్రదేశంలో బిళ్ళ గన్నేరు ఆకులు రసం అప్లై చేస్తే వెంటనే ఆ సమస్య తగ్గిపోతుంది. అలాగే వాపులు, మంట, నొప్పి కూడా తగ్గుతాయి.
బిపి: బిళ్ళ గన్నేరు ఆకుల నుంచి తీసిన రసాన్ని ప్రతినిత్యం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టవచ్చు..
మానసిక సమస్య: మానసిక ఆందోళన, ఒత్తిడితో డిప్రెషన్ లో ఉండి నిద్ర పట్టకపోతే ఈ మొక్క ఆకుల్ని రసాన్ని రోజు తీసుకుంటే మనసిక సమస్య తగ్గిపోతుంది.
నెలసరి సమస్యలు: సాధారణంగా మహిళలు నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే ఐదు బిళ్ళగన్నేరు ఆకులు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి మరిగిన నీటిని తీసుకోవడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి బయటపడవచ్చు..
డయాబెటిస్: బిళ్ళ గన్నేరు మొక్క వెతికి మంచినీటిలో శుభ్రంగా కడి ఆ తర్వాత వేర్లను ఎండబెట్టి పొడి చేసుకుని ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి. తర్వాత అర టేబుల్ స్పూన్ బిల్లగన్నేరు పొడికి టేబుల్ స్పూన్ తేనె కలిపి నిత్యం పరిగడుపున అలాగే రాత్రి అన్నం తినే ముందు తీసుకోవాలి. ప్రతిరోజు ఈ విధంగా చేయడం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
క్యాన్సర్: బిళ్ళ గన్నేరు పొడితో డికాషన్ తయారు చేసుకొని తీసుకోవడం వల్ల క్యాన్సర్ తగ్గిపోతుంది. అలాగే ఈ ఆకుల రసం తీసి నిత్యం తాగిన కూడా క్యాన్సర్ నుంచి ఉపశమనం కలుగుతుంది.