చీకటి పడిన తర్వాత వాకిలి ఊడ్చకూడదా.. ఊడిస్తే ఏం జరుగుతుంది?
మనం ఇంటిని శుభ్రం చేసుకునేందుకు చీపురుతో ఊడ్చుకుంటాం. ఇంట్లో ఉన్న అన్ని గదులను చీపురుతో ఊడ్చుకుని క్లీన్ గా ఉంచుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఇలా ఇంటిని శుభ్రం చేసుకునేందుకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. తెల్లవారు జామున నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే సాయంత్రం కూడా క్లీన్ చేసుకోవాలి.చీపురుతో శుభ్రం చేసుకునే వాళ్లు కొ1న్ని జాగ్రత్తలు పాటించాలి. ఉదయం ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసి దేవుడికి దీపారాధన చేయాలి. అలాగే సాయంత్రం కూడా ఇంటిని శుభ్రం చేసుకోవడానికి, దీపారాధన చేయడానికి కొన్ని షరతులు పాటించాలి. అప్పుడే ఇంట్లోకి లక్ష్మీ దేవి వస్తుందని పండితులు చెబుతున్నారు.
సాయంకాల సమయంలో చీకటి పడకముందే వాకిలి ఊడ్చి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని, వాకిలిని చీపురుతో క్లీన్ చేసుకున్న తర్వాత.. కాళ్లు, చేతులు కడుక్కుని లేదా స్నానం చేసి దేవునికి పూజలు చేయవచ్చు.అదృష్ట దేవతలను ఆకర్షించడానికి, దుర దృష్ట దేవతలను దగ్గరకు రానీయకుండా ఉండటానికి ఈ విధమైన ఆచారం ఉంది. కానీ చీకటి పడిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాకిలి ఊడవకూడదు. అలాగే నీరు చల్లి శుభ్రం చేసుకోకూడదు. చీకటి పడ్డాక చీపురు ఎందుకు పట్టకూడదు అంటే… ఆ సమయంలో చీకటిగా ఉండి ఏమీ సరిగ్గా కనిపించదు. కొన్ని చోట్ల శుభ్రంగానూ, కొన్ని చోట్ల చెత్తాచెదారం అలాగే ఉండే అవకాశం ఉంది.
అలాగే చీకటి పడిన తరువాత నేలపై తిరిగే ప్రాణులు బయటకు వస్తాయని కూడా. వాటి వలన మనకు ప్రమాదం ఉంది కాబట్టి. చీకటి పడక ముందే ఇంటిని చీపురుతో ఊడ్చుకుని శుభ్రం చేసుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయానికి ముందే వాకిలిని ఊడవడం మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం.పిల్లలు ఉన్న ఇల్లు అయితే.. ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. కింద పాకే పిల్లలు ఉన్నట్లైతే ఇంటి క్లీనింగ్ లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. ఫ్లోర్ పై పేరుకుపోయిన దుమ్మును చీపురుతో లేదా గుడ్డతో తీసి వెయ్యాలి. తర్వాత డెటాల్ లాంటి లిక్విడ్ తో మంచిగా తడి పెట్టి తుడుచుకోవాలి. దీని వల్ల ఫ్లోర్ పై పేరుకుపోయిన సూక్ష్మ క్రిములు నశిస్తాయి. అలా శుభ్రం చేసుకున్న ఇంటి గచ్చుపై పిల్లలు ఎలా అయినా ఆడుకోవచ్చు.