బొట్టు ఎందుకు పెట్టుకోవాలి.. అలా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?
హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతీ ఒక్కరూ విధిగా బొట్టు పెట్టుకోవాలంటారు. ఒకప్పుడు అందరూ బొట్టు పెట్టుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వచ్చేవారు. ముఖ్యంగా స్త్రీలు అయితే తప్పని సరిగా కుంకుమ పెట్టుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది అసలు బొట్టే పెట్టుకోవట్లేదు. ఇంకా కుంకుమ అయితే ఏ పండగలో, పబ్బాలకో తప్ప అస్సలు ధరించడం లేదు. అసలు ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా బొట్టు పెట్టుకోవాల్సిందేనా, అలా పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.సనాతన ధర్మాన్ని పాటించే వారందరూ నుదిటి మీద కుంకుమ లేదా తిలకం లేదా విభూది పెట్టుకుంటూ ఉంటారు. హిందువులకు సంబంధించినంత వరకు ఇది చాలా ముఖ్యమైనది. ఈ సంప్రదాయం వెనుక ఇటు ఆధ్యాత్మిక కారణాలతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని పన పెద్దలు చెబుతున్నారు.
ఇస్కాన్ ప్రకారం మానవ శరీరంలో పరమాత్మ ఉంటాడు. అంటే ఈ శ్రీ కృష్ణ పరమాత్ముడు లేదా విష్ణు మూర్తి ప్రతీ ఒక్కరి శరీరంలో ఉంటాడని వారి నమ్మకం. పరమాత్ముడికి మన శరీరం ఇల్లు లాంటిదని… కాబట్టి ఇల్లుని శ్రద్ధగా పవిత్రంగా అలంకరించుకోవడం అవసరం అని వారి ఉద్దేశం. అందుకే కృష్ణ, విష్ణు భక్తులు నిలువు నామాన్ని తిలకంగా ధరిస్తారు. తిలకాన్ని పూర్వ కాలంలో పుణ్య నదుల మట్టి నుంచి సేకరించే వారట. ఎందుకంటే అక్కడ వేలాది మంది స్నాలు ఆచరించే వారు. అలా ఆ మట్టికి ఎనలేని పవిత్రత చేకూరుతుందని ఇస్కార్ వారి నమ్మకం. ఇక శివ భక్తులు శివుడి వైరాగ్యాన్ని తాము కూడా ధరిస్తున్నట్లు చెప్పడానికి విభూదిని ధరిస్తారు. ఇదంతా ఆథ్యాత్మికత ఉన్న వాళ్లకోసం. అయితే సాన్స్ పరంగా కూడా తిలకాన్ని ధరించడం మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.
అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.కను బొమ్మల మధ్య ఒక నెర్వ్ పాయింట్ ఉంటుందదట. దీన్నే ఇంగ్లీషులో concentration point అని పిలుస్తారు. అయితే ఇది pineal మరియు pituitary glands కి కనెక్ట్ అయి ఉంటుందట. దీన్నే intuition point అని కూడా అంటారు. ఈ పాయింట్ వద్ద ప్రశాంతత చాలా అవసరం. అప్పుడే మనకు ఏకాగ్రత వస్తుందట. ఆ పాయింట్ వద్ద చల్ల దనంతో పాటు రక్త ప్రసరణ బాగా ఉండాలని మన పెద్దలు నుదిట తిలకాన్ని ధరించడం మొదలు పెట్టారు. అలా పెట్టుకోవడం వల్ల వారికి రక్త ప్రసరణ బాగా జరిగి ప్రశాంతత లభించడంతో తమ మనసుని అదుపులో పెట్టుకో గలిగే వారట. అలా చేయడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందట. అందుకే ప్రతీ ఒక్కరూ కుంకుమ ధరించాలని చెబుతుంటారు.