Akshithalu : అక్షితలు వేసే ఎందుకు దీవిస్తారు.. అలా వేయడానికి గల కారణమేంటి?
Akshithalu : పండగలు, పబ్బాలు, పూజలు, పునస్కారాలు, శుభకార్యాల అప్పుడు పెద్దలు చిన్న వాళ్లని అక్షితలు వేసి దీవిస్తుంటారు. బియ్యానికి పసుపుని కలిపి వాటిని తలపై చల్లి దీవిస్తుంటారు. అలాగే మనం పూజలు, వ్రతాలు చేసుకునేటప్పుడు కూడా ఈ అక్షతలనే దేవుడిపై కూడా చల్లుతుంటాం. అయితే పెద్దలు మనల్ని ఆశీర్వదించే టప్పుడు కచ్చితంగా ఈ అక్షతలను వాడాల్సిందేనా. అసలు ఇలా వేయడం వల్ల లాభం ఏమిటి. వేయకుండా దీవించకూడదా అనే అనుమానాలు చాలా మందికి వచ్చే ఉంటాయి. అయితే ఇలాంటి ప్రశ్నిలన్నింటికి సమాధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.అక్షితలు అంటే క్షతం కానివి అని అర్ధం.
అంటే రోకలి పోటుకు విరగనివి అనే అర్థం వస్తుంది. శ్రేష్ఠమైన బియ్యమే రోకలి పోటుకు విరగవు.. అలాంటి బియ్యాన్ని పసుపు మరియు నెయ్యితో లేక, నూనెతో కలిపి అక్షితలు తయారు చేస్తారు. అయితే బియ్యం అంటే చంద్రుడికి చాలా ఇష్టం. మనస్సుకు అధి నాయకుడైన చంద్రుడు ప్రభావం మనుషులపై అధికంగా ఉంటుందట. మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము ఇవన్నీ ఆయనపైనే ఆధారపడి ఉంటాయట. అందుకే ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని, మనో ధర్మాన్ని నియంత్రిస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే అందుకే అక్షతలను తల పై వేసి ఆశీర్వదిస్తారు.మనిషి శరీరం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చు తగ్గులు సర్వ సాధారణం. అయితే ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. బియ్యానికి విద్యుత్ శక్తినిని గ్రహించే తత్వం ఉంటుందట.
అందుకే మన పెద్దలు తలపై అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు. అయితే ఆ సమయంలో, వారి దేహంలోని విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్ బదిలీ అవుతుంది. అలా తలపై అక్షితలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. ఇలా పెద్దలోలో ఉండే సాత్విక గుణం అక్షితల ద్వారా పిల్లలకు లభిస్తుందట. ఆథ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యమేనని మన పురాణాలు చెబుతున్నాయి. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షితలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టి, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే.