ఉత్తరం దిక్కుకు తల పెట్టి పడుకుంటే.. అన్ని అనర్ధాలా..!
హిందూ సంప్రదాయంలో ఎన్నో నియమాలు, పద్ధతులు ఉంటాయి. కొన్ని నమ్మకాలను కూడా ఈజీగీ ఫాలో అయిపోతుంటారు మన వాళ్లు. అయితే వీటిని చాలా మంది మూఢ నమ్మకాలు అని చెప్పినా పట్టించుకోకుండా వాటిని ఫాలో అవుతుంటారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. మన పూర్వీకులు ఏది చెప్పినా దాని వెనుక ఏదో ఒక కారణం కచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో మనకు తెలియకపోయినప్పటికీ వారు చెప్పిన పద్ధతులు, నమ్మకాలను మనం ఇంకా పాటిస్తున్నాం. అందులో భాగమే ఇవన్నీ. అయితే ఉత్తరం దిక్కుకు తల చేసి పడుకోకూడదని చెబుతుంటారు మన పెద్దలు. అయితే కొంత మంది వీటిని నమ్మినప్పడికీ… చాలా మంది ఇది మూఢ నమ్మకం అంటుంటారు. మరి ఈ ఉత్తరం దిక్కున ఎందుడు పడుకోకూడదు.
ఒకవేళ అలా పడుకుంటే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తర దిక్కున తలపెట్టి పడుకోకూడదని… ఒక వేళ అలా పడుకుంటే మనకు ఏదో ఒక అనర్థం జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. వీలయినంత వరకు అటు వైపు తల పెట్టి నిద్రించవద్దని అంటుంటారు. అలా చేయడం వల్ల వాస్తు దోషం కల్గుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు. అయితే ఇది మూఢ నమ్మకం కాదని సైన్స్ చెబుతోంది. నిజంగానే ఉత్తరం దిక్కుకు తల పెట్టి పడుకోకడూదని వివరిస్తోంది. భూమిలో అయస్కాంత క్షేత్రం ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఇమిడి ఉంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే అలాగే మానవ శరీరంరోనూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. తల వైపు ఉత్తరం, కాళ్ల వైపు దక్షిణ దిశ ఉంటుందట. అందుకే తలను ఉత్తరం వైపు పెడితే… ఉత్తర ధృవాలు రెండు ఒకే వైపు అవితాయి.
అయితే సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి.విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని మనకు తెలిసిందే. ఇలా రెండు ధృవాలు ఒకే వైపుకు ఉండటం వల్ల అవి వికర్షించుకుంటాయి. దాని వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంట. మనల్ని నడిపించే, అత్యంత శక్తివంతమైన మన శరీరంలోని మొదడు… ఉత్తర దిశలో ఉన్న ఆయస్కాంత శక్తి ప్రభావంతో శక్తిని కోల్పోతుందట. మెదడులో ఉన్న కోబాల్ట్, నికిల్, ఐరన్ కణాలను ఆకర్షించడం వల్లే మెదడు మొద్దు బారిపోతుందని సైన్స్ చెబుతోంది. ఇలా జరగడం వల్ల ప్రతీ రోజూ పీడకలలు రావడం, సరిగ్గా నిద్ర పట్టటక పోవడం.. అలాగే ఒక్కసారిగా మెల్కువ రావడం వంటివి జరుగుతాయంట. నిద్ర లేమి వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో మనకు తెలియంది కాదు. అందుకే పెద్దల మాటను తూచా తప్పకుండా పాటించాలి. ఇక నుంచి అయినా ఉత్తరం దిక్కు వైపుకు తన పెట్టి పడుకోకండి.