what is the reason behind we do not sit on the gadapa
Gadapa : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద గడపకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పండుగలు, వారాల్లో గడపకు పసుపు రాసి ముగ్గులు పెట్టడం మన ఆనవాయితీ. అంతే కాదండోయ్ గడపను మనం దేవతగా పూజిస్తాం. పూలు కూడా సమర్పిస్తుంటాం. అయితే ఇంటి గుమ్మం వద్ద ఉండే గడపను తొక్కడం కానీ దానిపై కూర్చోవడం గానీ చేయ కూడదని మన పెద్దలు చెబుతుంటారు. అలా చేయడం వల్ల మనకు అశుభం జరుగుతుందని… అందుకే అస్సలే కూర్చోకూడదని వివరిస్తుంటారు. అయితే గడపపై కూర్చోవడం వల్ల నిజంగానే అశుభం కల్గుతుందా.. అసలు మన పెద్దలు ఎందుకు గడపపై కూర్చోకూడదని చెబుతుంటారో మం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన ద్వారం వద్ద ఉండే గడపపై కూర్చోవడం మంచిది కాదని మన వేద పండితులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ప్రధాన ద్వారం లోపల గడపకు కింద ఉండే మెట్లపై కూడా కూర్చోవడం మంచిది కాదని అంటారు. ఈ రెండు ప్రదేశాలలో కూర్చోవడం వల్ల ఇంటిలోనికి వచ్చే లక్ష్మీ దేవిని మనం అడ్డుకున్న వాళ్లం అవుతామని వేద పండితులు చెబుతున్నారు. అలాగే ఇల్లు కట్టుకున్న సమయంలో పూజ లు చేసి కొన్ని వస్తువులను ఇంటి ప్రధాన ద్వారం వద్ద గల గడప కింద ఉంచుతాం. అలా పెట్టిన నాటి నుంచి గడప ను కూడా దేవుడిలా.. లక్ష్మీ దేవీ లా మనం పూజిస్తాం అందుకే గడప పై కూర్చోకూడదని అంటారు.
what is the reason behind we do not sit on the gadapa
అలాగే సైన్స్ ప్రకారం మన ఇంట్లోకి ప్రధాన ద్వారాల నుంచి అలాగే కిటికీల నుంచి గాలి, వెలుతురు వస్తుంటుంది. అయితే అలా వచ్చే గాలి లో ఎక్కువ బ్యాక్టీరియా, వైరస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి నేరుగా మన పైనే పడుతాయి. అందుకే గడప పై కూర్చోవడం మంచిది కాదని అంటారు. అలాగే గాలి ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి తీసుకు వెళ్తుంది. ఈ సమయం లో కూడా మనం దానికి అడ్డు గా ఉండకూడదు. అందుకే గడప పై కూర్చోవడం అరిష్టంగా భావిస్తారు. అందుకే గడపపై కూర్చో వద్దని మన పెద్దల నుండి వేద పండితుల వరకు సూచిస్తారు. అందుకే ఇంకెప్పుడు గడపపై కూర్చోకండి.
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
This website uses cookies.