Gadapa : గడపపై ఎందుకు కూర్చోకూడదు. ఒకవేళ కూర్చుంటే ఏం జరుగుతుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gadapa : గడపపై ఎందుకు కూర్చోకూడదు. ఒకవేళ కూర్చుంటే ఏం జరుగుతుంది?

Gadapa : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద గడపకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పండుగలు, వారాల్లో గడపకు పసుపు రాసి ముగ్గులు పెట్టడం మన ఆనవాయితీ. అంతే కాదండోయ్ గడపను మనం దేవతగా పూజిస్తాం. పూలు కూడా సమర్పిస్తుంటాం. అయితే ఇంటి గుమ్మం వద్ద ఉండే గడపను తొక్కడం కానీ దానిపై కూర్చోవడం గానీ చేయ కూడదని మన పెద్దలు చెబుతుంటారు. అలా చేయడం వల్ల మనకు అశుభం జరుగుతుందని… […]

 Authored By pavan | The Telugu News | Updated on :25 March 2022,6:00 am

Gadapa : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద గడపకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పండుగలు, వారాల్లో గడపకు పసుపు రాసి ముగ్గులు పెట్టడం మన ఆనవాయితీ. అంతే కాదండోయ్ గడపను మనం దేవతగా పూజిస్తాం. పూలు కూడా సమర్పిస్తుంటాం. అయితే ఇంటి గుమ్మం వద్ద ఉండే గడపను తొక్కడం కానీ దానిపై కూర్చోవడం గానీ చేయ కూడదని మన పెద్దలు చెబుతుంటారు. అలా చేయడం వల్ల మనకు అశుభం జరుగుతుందని… అందుకే అస్సలే కూర్చోకూడదని వివరిస్తుంటారు. అయితే గడపపై కూర్చోవడం వల్ల నిజంగానే అశుభం కల్గుతుందా.. అసలు మన పెద్దలు ఎందుకు గడపపై కూర్చోకూడదని చెబుతుంటారో మం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌ధాన ద్వారం వద్ద ఉండే గడపపై కూర్చోవడం మంచిది కాదని మన వేద పండితులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ప్ర‌ధాన ద్వారం లోపల‌ గడపకు కింద ఉండే మెట్లపై కూడా కూర్చోవడం మంచిది కాదని అంటారు. ఈ రెండు ప్ర‌దేశాల‌లో కూర్చోవ‌డం వ‌ల్ల ఇంటిలోనికి వచ్చే లక్ష్మీ దేవిని మ‌నం అడ్డుకున్న వాళ్లం అవుతామ‌ని వేద పండితులు చెబుతున్నారు. అలాగే ఇల్లు క‌ట్టుకున్న స‌మ‌యంలో పూజ లు చేసి కొన్ని వ‌స్తువులను ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద గ‌ల గ‌డప కింద ఉంచుతాం. అలా పెట్టిన నాటి నుంచి గ‌డ‌ప ను కూడా దేవుడిలా.. ల‌క్ష్మీ దేవీ లా మ‌నం పూజిస్తాం అందుకే గ‌డ‌ప పై కూర్చోకూడ‌ద‌ని అంటారు.

what is the reason behind we do not sit on the gadapa

what is the reason behind we do not sit on the gadapa

అలాగే సైన్స్ ప్ర‌కారం మ‌న ఇంట్లోకి ప్ర‌ధాన ద్వారాల నుంచి అలాగే కిటికీల నుంచి గాలి, వెలుతురు వ‌స్తుంటుంది. అయితే అలా వ‌చ్చే గాలి లో ఎక్కువ బ్యాక్టీరియా,  వైర‌స్ ఉండే అవ‌కాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి నేరుగా మ‌న పైనే ప‌డుతాయి. అందుకే గ‌డ‌ప పై కూర్చోవ‌డం మంచిది కాద‌ని అంటారు. అలాగే గాలి ఇంట్లోకి వ‌చ్చి ఇంట్లో ఉన్న నెగటివ్‌ ఎనర్జీ బయటికి తీసుకు వెళ్తుంది. ఈ స‌మ‌యం లో కూడా మ‌నం దానికి అడ్డు గా ఉండ‌కూడ‌దు. అందుకే గ‌డ‌ప పై కూర్చోవ‌డం అరిష్టంగా భావిస్తారు.  అందుకే గడపపై కూర్చో వద్దని మన పెద్దల నుండి వేద పండితుల వరకు సూచిస్తారు. అందుకే ఇంకెప్పుడు గడపపై కూర్చోకండి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది