Sashtanga Namaskar : మహిళలు దేవుడికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు?
Sashtanga Namaskar : హిందూ సంప్రదాయాల ప్రకారం గుడిలో దేవుడికి లేదా పెద్దలకు నమస్కారం చేయడం మన ఆనవాయతీగా వస్తోంది. అయితే ఇందులో పురుషులకు, స్త్రీలకు కాస్తంతా వ్యత్యాసం ఉంది. అయితే పురుషులు ఎక్కడైనా సాష్టాంగ నమస్కారం చేయొచ్చు. కానీ స్త్రీలు మాత్రం అస్సలే సాష్టాంగ నమస్కారం చేయకూడదని మన పెద్దలు చెబుతున్నారు. అసలు స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.సాష్టాంగ నమస్కారం అనగా ఎనిమిది అంగాలను భూమికి ఆన్చి నమస్కారం చేయడం. అంటే వక్ష స్థలం, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు కళ్లు భూమిపై ఆన్చి దేవుడికి లేదా పెద్దలను మొక్కడం. అయితే ఇలా పురుషులు మాత్రమే చేయొచ్చు. అయితే ఆడవాళ్లు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఉదరం నేలకు తగులుతుంది.
ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల గర్భకోశానికి ఏమైనా సమస్య వస్తే… చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు.కేవలం మోకాళ్లపై మాత్రమే కూర్చొని నమస్కరించాలని అంటారు. అలా చేయలేకని వారు కాస్త వంగి నమస్కరించినా సరిపోతుందంటారు. ఇలా చెయ్యడం వల్ల స్త్రీలకు ఎటువంటి సమస్యా కల్గదు. అలాగే స్త్రీలు పంచాగ నమస్కారం చేసుకోవచ్చని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అంటే రెండు కాళ్లు, రెండు చేతు, నుదురు మాత్రమే నేలకు తాకేలా నమస్కారం చేయడం. అలాగే ఉరస్సుతో నమస్కారం అనగా దేవుడికి నమస్కారం చేసేటప్పుడు ఛాతీ నేలకు తగలాలి. శిరసుస్సుతో అంటే నుదురు నేలకు తగిలేలా నమస్కరించాలి.

what is the reason behind womens dont do sashtanga namaskar
దృష్టితో అనగా నమస్కారం చేసేటప్పుడు రెండు కళ్లు మూసుకొని దేవుడిని మనసులో స్మరించుకుంటూ మొక‌్కాలి. అంతే కాకుండా మనస్సుతో అంటే… మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించాలి. అంతేకాని ఏదో మొక్కుబడిగా మొక్కకూడదని మన పురాణాలు చెబుతుున్నాయి. వచసా నమస్కారం అంటే వాక్కుతో… అనగా దైవ నామ స్మరణ చేస్తూ… మొక్కాలి. అంటే ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ అంటూ నమస్కారం చేసుకోవాలి. పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదాలు నేలకు తగిలేలా చూస్కోవాలి. అలా కరాభ్యాం… రెండు చేతులు నేలకు తగిలేలా ప్రార్థించాలి. జానుభ్యాం నమస్కారం అంటే రెండు మోకాళ్లు నేలకు ఆన్చి నమస్కారం చేయడం.