Jyothisya Sasthra : నేటి కాలం అంతా డబ్బుమయమే. ప్రతి వ్యక్తి డబ్బు సాధించడం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఏం చేయాలనుకున్న ఏం కొనాలనుకున్నా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇక ఈ డబ్బు లేకపోతే సమాజంలోనే కాదు ఇంట్లో కూడా గౌరవం ఉండదు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. ప్రతి మనిషికి డబ్బు చాలా ముఖ్యం. అందుకే డబ్బు కోసం మనిషి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం ఎలాంటి దారుణాలు చేయడం కోసమైనా సిద్ధంగా ఉంటున్నారు. ముఖ్యంగా డబ్బుకి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారు. డబ్బుని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ఒకవేళ పొరపాటున డబ్బులు కింద పడితే వాటిని కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు.అలాగే కొన్ని సందర్భాలలో కొన్ని వారాలలో డబ్బును ఇతరులకు అస్సలు ఇవ్వరు. మరి ఇలా ఎందుకు చేస్తారు శుక్రవారం మంగళవారం డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
హిందువులు మంగళ మరియు శుక్రవారాలలో డబ్బుని అప్పుగా ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. అయితే ఈ నియమం పూర్వం నుంచే ఉంది. హిందువులు ఎక్కువగా మంగళ శుక్రవారాలలో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కాబట్టి ఈ రోజులలో డబ్బును ఎవరికైనా అప్పుగా ఇస్తే అవి మళ్లీ తిరిగి రావని నమ్ముతారు. మరి మంగళ శుక్రవారాలలో డబ్బుని అప్పుగా ఇవ్వవచ్చా..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..? ఈ వివరాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
హిందూమతంలో మంగళ అంటే శుభం అని అర్థం. అయితే మంగళవారానికి అధిపతి కుజగ్రహం. కాబట్టి ఈరోజున డబ్బుని అప్పుగా ఇస్తే అది తిరిగి మళ్ళీ రాదని మరియు ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్ముతారు. అందుకోసమే ఈ రోజున డబ్బు ఖర్చు పెట్టడానికి మరియు అప్పుగా ఇవ్వడానికి ఇష్టపడరు.
ఈ నియమాలను శుక్రవారం కూడా పాటించాలి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రత్యేకమైన రోజు కనుక ఈరోజు డబ్బులు అప్పుగా ఇస్తే అది వెనక్కి రాదు అని నమ్ముతారు. కాబట్టి శుక్రవారం డబ్బుని అప్పుగా ఇవ్వరు. అయితే శాస్త్రాల ప్రకారం మంగళ శుక్రవారం ఎవరికీ ఇవ్వకూడదని చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా కష్టాలలో ఉంటే వారికి డబ్బు ఇవ్వచ్చు. అలాగే ఈ వారాలలో డబ్బుని ఖర్చు పెట్టవచ్చు. ఇది కేవలం అపోహ మాత్రమే.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.