ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేయాలో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేయాలో తెలుసా?

 Authored By pavan | The Telugu News | Updated on :24 February 2022,4:00 pm

మనం పూజ చేసే సమయంలో మనకు దొరికిన పూలను స్వామి లేదా అమ్మవార్లకు సమర్పిస్తుంటాం. మన పెరట్లో ఉన్నవో లేదా ఇంటికి దగ్గరగా ఉన్న పూలనో తీసుకొచ్చి దీపారాధన చేస్తుంటాం. కానీ అలా చేయడం దేవుడు కొన్ని సార్లు మనపై దయ చూపినా మరికొన్ని పూజా ఫలం అందకుండా చేస్తాడు. అందుకు కారణం మనకు తెలియకుండానే ఆ దేవుడికి పెట్టకూడని పూలను పెడ్తుంటాం. దాని వల్ల మనకు లాభం చేకూరపోగా నష్టం వాటిల్లుతుంది. అందుకే ఏయే దేవుడికి ఎలాంటి పూలు పెట్టాలి, ఏవి పెట్టకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాళీ మాతకు ఎర్ర మందార పూలు అంటే చాలా ఇష్టం. ఎర్ర మందార పూలతో అమ్మవారిని పూజించడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది

. అంతేకాకుండా అమ్మవారి దయ మనపై ఎల్లప్పుడూ ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్రీ మహా విష్ణువుకి పారిజాత పుష్పాలు అంటే ఇష్టమట. క్షీర సాగర మథనాన్ని చిలుకుతున్నప్పుడు సముద్రగర్భంలోంచి ఎన్నో వస్తువులు ఉద్భవించాయి. అలా ఉద్భవించిన వాటిలో పారిజాత వృక్షం ఒకటి. ఇలా క్షీరసాగర మథనంలో నుంచి వచ్చిన పారిజాత వృక్షమన్నా పూలన్నా ఈ స్వామి వారికి ఎంతో ఇష్టమట. ఈ పూలు వెదజల్లే వాసనతో స్వామి మైమరిచిపోతాడట. అందుకే విష్ణువుకు పారిజాత పుష్పాలతో పూజ చేయడం వల్ల మనం కోరుకున్నవి నెరవేరుతాయట.అలాగే విఘ్నాలను తొలగించే ఈ విఘ్నేశ్వరుడికి బంతిపూలు,తెల్ల జిల్లేడు అంటే ఇష్టమట.

which god like which flowers

which god like which flowers

బంతి పూలు ప్రతికూల పరిస్థితులను తొలగించి అనుకూల పరిస్థితులను ఏర్పరుస్తాయట. అందుకే మనం ఎలాంటి శుభకార్యం చేసినా బంతి పూలను అలంకరణ కోసం వాడుతుంటారు. ఇక హోళీ పండుగ నాడు పల్లెల్లో రంగులు తయారు చేసేందుకు వాడే గోగి పువ్వు అంటే సరస్వతీ దేవికి ఎంతో ప్రీతికరం. జ్ఞానానికి తెలివికి ప్రతీకగా నిలిచే ఈ పుష్పాలను సరస్వతీ దేవికి సమర్పించి అలాపూడ చేయడం వల్ల తెలివి తేటలతో పాటు జ్ఞానం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే లక్షీదేవికి తామర పూలంటే చాలా ఇష్టం. అందుకే అమ్మవారికి తామర పూలతో పూజ చేయాలి. భక్తుల్లో భయాన్ని పోగొట్టే ఆ ఆంజనేయ స్వామికి తెల్ల జిల్లేడు పూలంటే చాలా ఇష్టం. అలాగే తమలపాకులు అంటే కూడా. అందుకే స్వామివారికి జిల్లేడు పూలతో పూజ చేయాలి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది