Dry Coconut : ఎండు కొబ్బరె గా అని తీసి పడేస్తున్నారా… దీనితో ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dry Coconut : ఎండు కొబ్బరె గా అని తీసి పడేస్తున్నారా… దీనితో ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చు…?

 Authored By ramu | The Telugu News | Updated on :29 December 2024,2:00 pm

Dry Coconut : మనం దేవుడి దగ్గర అయినా, లేదా మామూలుగా కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరిని వినియోగించుకోకుండా బయట పడెస్తాము. కొంతమంది కొబ్బరికాయలు ఎండబెట్టి, ఎండు కొబ్బరి తయారు చేస్తారు. కొంతమంది ఎక్కువగా ఈ ఎండు కొబ్బరిని కూడా వినియోగించారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ ఎండు కొబ్బరి వల్ల చాలా లాభాలు ఉన్నాయని తెలియజేశారు. ఎండుకొబ్బరిలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్,విటమిన్ బి, పుష్కలంగా ఉంటాయి. దీని ప్రతిరోజు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు. ఉదయం పూట ఎండు కొబ్బరి తింటే రక్తహీనత దరిచేరదు. ఎండు కొబ్బరితో బెల్లం చేర్చి తింటే హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.

Dry Coconut ఎండు కొబ్బరె గా అని తీసి పడేస్తున్నారా దీనితో ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చు

Dry Coconut : ఎండు కొబ్బరె గా అని తీసి పడేస్తున్నారా… దీనితో ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చు…?

ఇటువంటి కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆంటీ ఆక్సిడెంట్లు,పోషకాలు అద్భుతమైన మూలం. దీంతోపాటు కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే ఎండుకొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. మనం నిత్యం ఆరోగ్యంగా హైడ్రేట్ గా ఉండడానికి కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే కాకుండా కొబ్బరి నూనె, కొబ్బరి చట్నీ రూపంలో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరిలో విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కొబ్బరి ముక్కను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారికి ఎండు కొబ్బరి చాలా మేలు చేస్తుంది. ఎండు కొబ్బరి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి, అధిక రక్తపోటు నుండి కాపాడుతుంది. ఉదయనాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచటంలో చాలా కీలక పాత్రను పోషిస్తుంది.

ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంతోపాటు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఎండు కొబ్బరి తింటే రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఉదయాన్నే కాలి కడుపుతో ఎండు కొబ్బరిని తింటే గుండె,మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్పారు. ఎండు కొబ్బరిలో క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్, మెగ్నీషియం, ఐరన్,విటమిన్ బి,మొదలైనవి ఉన్నాయి. అలాగే ఎండు కొబ్బరిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. కానీ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారు మాత్రం కొంచెం తక్కువగా తింటే మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది