బహుళ పక్షంలో జన్మించినవారు నిత్యం ఏ దేవుడిని పూజించాలి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

బహుళ పక్షంలో జన్మించినవారు నిత్యం ఏ దేవుడిని పూజించాలి ?

 Authored By keshava | The Telugu News | Updated on :12 February 2021,5:30 am

చంద్రకళలు చంద్రునికి సూర్యునికి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది. అత్యల్పదూరం అమావాస్య.అత్యధిక దూరం పౌర్ణమి. చంద్రుడు భూమి చుట్టూ భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటినే షడశ కళలు అంటే 16 కళలు అని అంటారు. వాటికి వరుసగా కింది పేర్లు పెట్టారు అవి…

చంద్రుని పదహారు కళలు: 1. అమృత, 2. మానద, 3. పూష, 4. తుష్టి, 5. పుష్టి, 6. రతి ధృతి, 7. కామదాయిని, 8. శశిని, 9. చంద్రిక, 10. కాంతి, 11. జ్యోత్స్న, 12. శ్రీ, 13. ప్రీతి, 14. అంగద, 15. పూర్ణ, 16. అపూర్ణ. 15 తిథులకు 16 ఎందుకు అంటే పూర్తి పౌర్ణమి,పూర్తి అమావాస్య ఘడియలు అనేవి స్వల్ప సమయమే ఉంటాయి.
ఈ 16 కళలకు నిత్యం ఆరాధింపవలసిన దేవతలు ఉన్నారు. నిత్యాదేవతలు మొత్తం 16 మంది 15 నిత్యలను త్రికోణంలోని ఒక్కొక్క రేఖ యందు ఐదుగురు చొప్పున పూజించి 16వ దైన లలితా త్రిపుర సుందరీదేవిని బిందువు నందు పూజించాలి. జాతకం ప్రకారం ఎవరు ఏ తిధిన జన్మిస్తే ఆయా దేవతా మంత్రాలను 11 సార్లు జపించాలి.లేదా ఆయా తిధులను బట్టి ఆయా మంత్రాలను ప్రతిరోజు 11 సార్లు పఠించటం మంచిది.

బహుళ పాడ్యమి నాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ విదియ నాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ తదియ నాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ చవితి నాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ పంచమి నాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ షష్ఠి నాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ సప్తమి నాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ అష్టమి నాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ నవమి నాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ దశమి నాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౡం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ ఏకాదశి నాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ ద్వాదశి నాడు పుట్టిన వారు “విజయా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ త్రయోదశి నాడు పుట్టిన వారు “సర్వమంగళా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ చతుర్ధశి నాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
అమావాస్య నాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
ఇలా ఆయా తిథులలో పుట్టిన వారు ఆయా నిత్యాదేవతలను పూజించాలి. భక్తిశ్రద్దలతో ఎవరైతే ఆయా దేవతలను ఆరాధిస్తారో వారికి ముగురమ్మల మూలపుటమ్మ శ్రీలలితాదేవి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రవచనం.

Also read

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది