Temples : గుడిలో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు కలిసే పెరుగాతాయి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Temples : గుడిలో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు కలిసే పెరుగాతాయి?

 Authored By pavan | The Telugu News | Updated on :9 May 2022,8:20 am

Temples : మన హిందూ సంప్రదాయాల ప్రకారం.. చెట్టుకు, రాయికీ ఇలా దేనికైనా మొక్కే ఆచారం ఉంది. కేవలం హిందూ సంప్రదాయంలోనే ముక్కోటి దేవతలు ఉన్నాయి. అందులో చాలా దేవుళ్లను రాళ్లు, రప్పల్లోనే చూస్కంటూ ఉంటారు. కేవలం ఇవే కాదండోయ్ పలు రకాల చెట్లలోనూ అమ్మవార్లను కొలుస్తుంటాం. తలసి, వేప, రావి, ఇలా చాలా చెట్లనే మన పూజిస్తుంటాం. అయితే మనం గుడికి వెళ్లినప్పుడు గుడిలో మనకు తప్పుకుండా కనిపంచే చెట్లటో ఈ మూడూ ఉంటాయి. సాధారణంగానే రావి చెట్టును అశ్వథ వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టు మొదట్లో విష్ణువు, బోదెలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు.

ఇది రూపం దాల్చిన విష్ణు స్వరూపం. మహాత్ములు దీన్ని పుణ్య మూలమని సేవిస్తారు. అలాగే వేప చెట్టును లక్ష్మీ దేవి అంశ గానూ భావించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయడం ద్వారా ఎన్నో దోషాలు తొలగి పరిపూర్ణ సుఖ జీవనం పొందుతారు.శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి. రావి చెట్టుకు నమస్కరిస్తే ఎన్నో దోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతుంటారు. శ్రీ కృష్ణ పరమాత్ముడు అంత్య దశలో ఈ చెట్టు కిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరుకున్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే వేప చెట్టు గాలికి కూడా ఎన్నో జబ్బులు దూరం అవుతాయట. ఈ చెట్టులో ఉండే అనేక ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయట. అద్భుతమైన ఈ చెట్టు ఆకులను పలు రోగాలకు ఔధంగా వినియోగిస్తారు.

why do ravi and neem trees are grow together in the Temples

why do ravi and neem trees are grow together in the Temples

వేప చెట్టు గాలికి రోగ కారక క్రిములు చనిపోతాయి. వేపాకులను నీటిలో వేసి మరిగించి తాగినా, స్నానం చేసిన అనేక రోగాలు దూరం అవుతాయి. అందుకు చర్మ వ్యాధులు, తట్టు, అమ్మవారు సోకినప్పుడు వేపాకులపైనే పడుకోబెడతారు. అమ్మవార్లకు వేపాకులు ఎంతో ఇష్టం కాబట్టి జాతర్ల సమయంలో ఎక్కువగా వినియోగిస్తారు. వేపచెట్టు లాటి దివ్యౌషద వృక్షం భూలోకంలో మరొకటి లేదు. మనం పెంచినా పెంచక పోయినా పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు వాటికవే పెరుగుతాయి. రావి చెట్టు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండ కూడదు. వేప చెట్టును ఇంటి ముందు కానీ వెనుక గానీ వేసుకోవాలి. ఇంటి ముందు వేప చెట్టు ఉండటం వల్ చల్లటి గాలితో పాటు అద్బుతమైన ఆరోగ్యాన్ని మన సంతం చేసుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది