Vastu Tips | హిందూ మతంలో రావి చెట్టు ప్రాధాన్యం .. ఇంటి గోడలపై పెరిగితే శుభమా, అశుభమా?
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం ఉంది. ముఖ్యంగా దేవతలు చెట్లలో నివసిస్తారని నమ్మకం. అందుకే చెట్లను నాటడం, వాటికి నీరు పోయడం, పూజించడం శుభప్రదమని విశ్వసిస్తారు. ఇది జీవితంలో ప్రతికూలత తొలగించడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది.

#image_title
ఇంటి గోడలపై రావి చెట్టు పెరిగితే?
ఆ చెట్లలో రావి చెట్టు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం, బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ చెట్టులోనే నివసిస్తారని చెబుతారు. శని దోష నివారణకు కూడా రావి చెట్టును పూజించడం ఎంతో శ్రేయస్కరంగా భావించబడుతుంది. అంతేకాదు, రావి చెట్టుకి నీరు పోస్తే పాపాలు నశిస్తాయని కూడా నమ్మకం ఉంది.
చాలామందికి ఇంటి గోడలపై రావి చెట్టు మొలకెత్తుతుంది. దీన్ని వాస్తు శాస్త్రం ఎలా చూస్తుందంటే
* ఇంటి గోడపై రావి చెట్టు పెరిగితే అది అశుభ సూచకం *.
* ఇలాంటి పరిస్థితి ఇంటి ఆనందం, ఆర్థిక శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతారు.
* ఇప్పటికే జరుగుతున్న పనులు అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
* కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనవలసి రావచ్చు.