Red Fanta Gods : హిందూ దేవుళ్లకు, దయ్యాలకు ఆ దేశంలో కూల్ డ్రింక్సే ప్రసాదంగా ఇస్తారట.. దీని వెనక ఆసక్తికర విషయాలు ఉన్నాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Red Fanta Gods : హిందూ దేవుళ్లకు, దయ్యాలకు ఆ దేశంలో కూల్ డ్రింక్సే ప్రసాదంగా ఇస్తారట.. దీని వెనక ఆసక్తికర విషయాలు ఉన్నాయి…!

Red Fanta Gods : ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటూ ఉంటాయి.. కొన్ని దేశాలలో సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలు చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సహజంగా కొన్ని దేశాలలో దేవుడికి ప్రసాదంగా స్వీట్స్ కొన్ని రకాల పాయసాలు, పండ్లు, బెల్లం, కొబ్బరికాయ ఇలా దేవుళ్లకు ప్రసాదంగా పెడుతూ ఉంటారు.. అయితే ఆదేశ ప్రజలను దేవుడికి ఏ ప్రసాదం పెడతారు అని ప్రశ్నిస్తే వేరే ఆలోచన లేకుండా కూల్ డ్రింక్స్ ఇస్తామని సమాధానం […]

 Authored By tech | The Telugu News | Updated on :10 March 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Red Fanta Gods : హిందూ దేవుళ్లకు, దయ్యాలకు ఆ దేశంలో కూల్ డ్రింక్సే ప్రసాదంగా ఇస్తారట.. దీని వెనక ఆసక్తికర విషయాలు ఉన్నాయి...!

Red Fanta Gods : ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటూ ఉంటాయి.. కొన్ని దేశాలలో సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలు చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సహజంగా కొన్ని దేశాలలో దేవుడికి ప్రసాదంగా స్వీట్స్ కొన్ని రకాల పాయసాలు, పండ్లు, బెల్లం, కొబ్బరికాయ ఇలా దేవుళ్లకు ప్రసాదంగా పెడుతూ ఉంటారు.. అయితే ఆదేశ ప్రజలను దేవుడికి ఏ ప్రసాదం పెడతారు అని ప్రశ్నిస్తే వేరే ఆలోచన లేకుండా కూల్ డ్రింక్స్ ఇస్తామని సమాధానం ఇస్తారట. అయితే ఏ డ్రింక్ పడితే ఆ డ్రింకు ఇవ్వరట. కేవలం ఎరుపు రంగులో ఉండే స్ట్రాబెరీ ఫ్లేవర్ పంటా దీన్నే కొందరు రెడ్ పాంట అని అంటారు. దీన్ని మాత్రమే ప్రసాదంగా ఇస్తారట. ఆ కలర్ మాత్రం ఎందుకు అనే చాలామంది అనుమానం ఉండవచ్చు. అయితే ఈ విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి.

ఆ దేశంలో కొన్ని హిందూ ఆలయాలు స్పిరిట్ హౌస్ల ముందు రెడ్ కలర్ కూల్ డ్రింక్స్ ఉంటాయి. వాటిని చూడగానే ఎవర్రా కూల్డ్రింక్స్ అక్కడ వదిలేసి వెళ్లిపోయారని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ దేశానికి కొత్తగా వెళ్ళనా వారు మాత్రమే అలా అనుకుంటారు. అక్కడ సాంప్రదాయాల మీద అవగాహన ఉన్నవారు దాన్ని పెద్దగా పట్టించుకోరు. హిందూ దేవుళ్ళు ఆలయాలు అనగానే అది ఏ దేశం తెలుసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది మరేదో కాదు . థాయిలాండ్ ఇండియా తరహాలో థాయిలాండ్ లో కూడా చాలామంది హిందువులు ఉంటున్నారు. వారు దేవుళ్ళ రూపాల నుంచి ఆలయాల వరకు ప్రతి ఒక్కటి భిన్నంగా ఉంటూ ఉంటాయి. వారి సాంప్రదాయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో ఒకటి ఈ కూల్డ్రింక్ ప్రసాదం విచిత్రమైన సాంప్రదాయం.

ఆత్మల కోసం గృహాలు: థాయిలాండ్ లోని చాలా గృహాలము ముందు కొన్ని చిన్న చిన్న చెక్క ఇల్లు బొమ్మ లాంటిది కనిపిస్తూ ఉంటాయి. వాటిని చాలా చక్కగా అలంకరిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇళ్ళ ముందు చెట్ల కింద వీటిని అలంకరిస్తారు.వీటిలో కొన్న ఆత్మల నిత్యం సంచరిస్తూ ఉంటాయని వాటికి స్థిరమైన నివాసం అవసరమని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందుకే వారు ఇటువంటి ఇళ్ళను నిర్మించి ఆత్మలకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. వాటికి రెడ్ కలర్ కూల్ డ్రింక్స్ ఆఫర్ చేస్తారు. అలా చేస్తే ఆత్మల తమని చల్లగా చూస్తాయని కోరికలు నెరవేరుస్తాయని అక్కడి వారి నమ్మకం.
హిందూ దేవుళ్ళకి రెడ్ పాంటా నే నైవేద్యం: కేవలం ఆత్మలకే కాదు దేవుళ్ళు కూడా కూల్డ్రింక్స్ నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఎప్పటినుంచో వస్తున్న ఈ ఆచారం ఈ విశ్వాసం వల్ల అక్కడ చాలా కూల్ డ్రింక్ స్ట్రాబెరీ గోల్డ్ రింగ్స్ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. అయితే అక్కడి దేవుళ్ళకి, ఆత్మలకి ఈ క్రెడిట్ చెందుతుంది. అక్కడ వాటిని తాగే వారి కంటే నైవేద్యంగా పెట్టే వారే అధికం.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది