Pooja Niyamalu : భర్త లేని స్త్రీలు ఏమేమి పూజలు చేసుకోవచ్చు.. పసుపు, కుంకుమ, పువ్వులు ధరించవచ్చా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Niyamalu : భర్త లేని స్త్రీలు ఏమేమి పూజలు చేసుకోవచ్చు.. పసుపు, కుంకుమ, పువ్వులు ధరించవచ్చా…!

 Authored By jyothi | The Telugu News | Updated on :10 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  Pooja Niyamalu : భర్త లేని స్త్రీలు ఏమేమి పూజలు చేసుకోవచ్చు.. పసుపు, కుంకుమ, పువ్వులు ధరించవచ్చా...!

Pooja Niyamalu : భర్త లేనటువంటి స్త్రీలు ఏ ఏ రకాల పూజలు చేసుకోవచ్చు.. పూలు, పసుపు, కుంకుమని భర్త లేని స్త్రీలు ధరించవచ్చా.? ఇలాంటి ముఖ్యమైనటువంటి సమాచారం మీరంతా తెలుసుకోబోతున్నారు. భర్త లేని ఆడవారు పూజలు చేయొచ్చా.. చేయకూడదా.. నోములు, వ్రతాలు లాంటివి ఆచరించవచ్చా భర్త గనుక చనిపోతే అకాల మరణం చెందితే ఈ స్త్రీలు ఇక పూజలు చేయడానికి పనికిరారా.. భగవంతుని ఏ విధంగా వేడుకోవాలి. భగవంతుడి కరుణాకటాక్షాలు పొందటానికి ఏ విధంగా భర్త లేని స్త్రీలు పూజలు ఆచరించాలి. ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. ఆడవారికి సహజంగానే భక్తి అనేది ఎక్కువ పాలలో ఉంటుంది. మగవారితో పోలిస్తే పూజ కోసం ఏర్పాట్లు చేయడం దగ్గర నుంచి భగవంతుని ఆరాధించడం ఉపవాసాలు చేయటం పువ్వులు తీసుకురావడం మాలలుగా కట్టడం అనేక పనులు భక్తితో చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరినీ దేవాలయాలకు బలవంతంగానే తీసుకెళ్తూ ఉంటారు. తోటి మహిళలతో కలిసి పుణ్య కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు.

సేవ చేస్తూ ఉంటారు. అయితే భర్త లేని ఆడవారు ఇలా ప్రతినిత్యం పూజలు, నోములు, వ్రతాలు లాంటివి చేసుకోవచ్చా.. అనేటువంటి సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది. పెళ్లైన స్త్రీలు భర్తని కోల్పోతే తర్వాత శుభకార్యాలకి పూజలకి దూరంగా ఉండాలని కొందరం అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వితంతువులు పూజలు వ్రతాలకు దూరంగా ఉండటం శాస్త్రాల్లో చెప్పబడిందా.. అంటే శాస్త్ర ప్రకారం భర్తలేని మహిళలు పూజలు చేయకూడదని ఎక్కడ ఉండదు. భగవంతుని పూజకు ఎలాంటి తప్పుగాని దోషం కానీ లేదని పండితులు చెబుతూ ఉంటారు. అయితే పసుపు, కుంకుమలు ఇవ్వటం కొన్ని రకాల పూజలు అంటే భార్యాభర్తలు ఇద్దరు పీటల మీద కూర్చొని చేసేటువంటి పూజలు తప్ప మిగతా ప్రతి పూజా ప్రతి వ్రతం కూడా భగవంతుని ఆరాధించడంలో బట్టలేని స్త్రీలు పాటించడంలో ఎలాంటి తప్పు ఉండదు. కార్తీక పురాణంలో కూడా ఒక స్త్రీ భర్త గాని తండ్రి గాని మరణించిన తర్వాత కార్తీక స్నానాలు ఆచరించిందని ఏకాదశి వ్రతం చేసిందని విష్ణు పూజ చేసిందని ఆ తర్వాత కావేరి నది స్నానం చేస్తుండగా మరణించి మరుసటి జన్మలో సత్యభామగా జన్మించిందని పండితులు చెప్తూ ఉంటారు.

కాబట్టి భర్త లేనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కార్తీక దీపోత్సవం, కార్తీక దీపోత్సవం, వసంత పంచమి, ఉగాది, వసంత నవరాత్రులు, శ్రీరామనవమి పూజలు ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది అభ్యంతరకరం లేకుండా జరుపుకోవచ్చు.. ప్రతినిత్యం భగవంతుని ఆరాధనలో నిమగ్నమై మరుజన్మలో వైధవ్యం లేకుండా సుమంగళిగా ఆశీర్వదించమని భగవంతుని వేడుకోవచ్చు. కాబట్టి శాస్త్రాల్లో గాని మన పురాణాల్లో కాని భర్త లేని స్త్రీలు పూజలు చేయకూడదని ఎక్కడా లేదు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది