Shani Dosha : పిల్లలపై కూడా ఏలినాటి శని ప్రభావం ఉంటుందా..? అసలు శని దోషం అంటే ఏమిటి.?
Shani Dosha : చాలామందికి నాకు ఏలినాటి శని ఉంది. ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏలినాటి శని అనేది పిల్లలలో కూడా ఉంటుందా.. అసలు ఏలినాటి శని అంటే ఏమిటి.? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 8 సంవత్సరాల లోపు పిల్లలకి ఏలినాటి శని దోషాలు మొదలైనప్పుడు తల్లిదండ్రులు కొద్దిగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని ,అర్ధాష్టమ శని ఫలితాలు పిల్లల మీద కూడా ఉంటాయి. వారి జీవితాలను కూడా ఈ దోషాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే పిల్లలకు ఊహ తెలియనప్పుడు ఈ దోషాల ప్రభావం ఎక్కువగా తల్లిదండ్రుల మీద పడుతూ ఉంటుంది. పిల్లలకు ఊహ తెలిసిన తర్వాత ఈ దోషాల ప్రభావం పిల్లల మీద పడుతుంది.
వాళ్లకి ఏలినాటి శని మొదలైనప్పుడు తల్లిదండ్రులు ఆరోగ్యానికి గురికావడమే కాకుండా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కూడా పడడమే కాకుండా ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక పిల్లలకు ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత చదువులో కొద్దిగా వెనకబడడం, ఏకాగ్రత తగ్గిపోవడం అలాగే అనారోగ్యానికి గురి కావడం లాంటివి వస్తూ ఉంటాయి. శని దోషం అంటే ఏమిటి.? శని గ్రహం ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తూ ఉంటుంది. జాతక చక్రంలో చంద్రుడు ఉన్న రాశి నుండి 12వ రాసి ఒకటవ రాసి రాశులు శనిసంచారాన్ని ఏలినాటి శని అని పిలుస్తుంటారు. అలాగే చంద్రుడు ఉన్న రాశి నుండి ఎనిమిదో రాశులు శని సంచారాన్ని అష్టమ శని అని చంద్రుడు ఉన్న రాశి నుంచి 4 రాశులు శని సంచారని అర్థష్ట శని అని చెప్తుంటారు.
శని ప్రభావం 7:30 సంవత్సరాలు ఉంటుంది. అష్టమ శని రెండున్నర సంవత్సరాల పాటు అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరాలు పాటు కలిగి ఉంటుంది. పిల్లల మీద వీటికి సంబంధించిన దోషాలు అధికంగా ఉంటాయి. సాధారణంగా వీరికి సమస్యలు బాధ్యతలు జీవితం పట్ల అవగాహన లేకపోవడం దోషాల సంబంధించిన ఫలితాలు కూడా తక్కువ స్థాయిలో ఉంటాయని ఉత్తర కాలామృతం అనే పురాతన జ్యోతిష్య గ్రంథం తెలుపుతోంది. పెద్దల మీద ఏలినాటి శని తదితర శని దోషాల ప్రభావం అధికంగా ఉండడానికి కారణం వారికి బాధ్యతలో ఆలోచనలు అవగాహన ఎక్కువగా ఉండటమేనని నిర్ధారణ అయింది. పరిహారం ఏమిటి.? తమ రాశుల ప్రకారం లేదా తమ నక్షత్ర ప్రకారం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చినప్పుడు శివాలయానికి వెళ్లి శివుని అర్చన చేయించుకోవడం
వలన శని దోషం తగ్గి మంచి ఫలితాలు పొందుతారు. శని ఒక్క శివుడికి మాత్రమే లోబడి ఉంటాడని శివుడు ఆదేశాలు మాత్రమే పాటిస్తాడని శివుడు అర్పించినప్పుడు తాను సంతృప్తి పొందుతాడని శాస్త్రం తెలుపుతుంది. దానివలన జాతకం ప్రకారం గాని సంచార ప్రకారంగానే శనిగ్రహం అనుకూలంగా లేనప్పుడు శివుడికి పూజ చేయించడమే చాలా శ్రేయస్కరం. ప్రధానంగా శనివారం నాడు ఇంట్లోనే శివుడికి పూజ చేయడం లేదా శివస్త్రం పటించడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. పిల్లల తరఫున తల్లిదండ్రులు కూడా ఈ పూజ చేయించిన అర్చన చేయించిన అదే ఫలితాలు పొందుతారు. విద్యార్థులపై ప్రభావం: చిన్నపిల్లల దశ కన్నా విద్యార్థి దశ శని దోషాల వల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది.
విద్యార్థి దశలో ఉన్నప్పుడు కొద్దిగా దారి తప్పడానికి దృష్టి మళ్లడానికి చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. వ్యక్తిగత జాతక చక్రంలో శని శుభగ్రహం అయిన పక్షంలో ఈ దోషాలు పెద్దగా వర్తించవు అలాగే వృషభం తులా, మకరం, కుంభరాశులకు చెందిన పిల్లలకు లేదా విద్యార్థులకు శని సంచార ప్రభావం అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతోంది. పిల్లల రాశుల మీద శనిసంచారం జరుగుతున్నప్పుడు శనిని దూషించడం కానీ శని పేరుతో ఇతరులను దూషించడం కానీ చేయకూడదు. శనిని పరోక్షంగా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ దూషించే పక్షంలో శని బలం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది..