Bhaskara Yoga : భాస్కరయోగంతో ఈ రాశుల ఇంట సంపదల పంట
ప్రధానాంశాలు:
Bhaskara Yoga : భాస్కరయోగంతో ఈ రాశుల ఇంట సంపదల పంట
Bhaskara Yoga : జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేసే సమయంలో వివిధ యోగాలను ఏర్పరుస్తాయి. జూన్ నెలలో జ్యోతిషశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన యోగాలు ఏర్పడుతున్నాయి. అటువంటి యోగాలలో భాస్కర యోగం ఒకటి. జ్యోతిష్యంలో బుధుడు, సూర్యుడు, చంద్రుడు, మరియు బృహస్పతి ప్రత్యేకమైన స్థానాల ద్వారా ఈ భాస్కర యోగం ఏర్పడుతుంది.
జూన్ మొదటి వారంలో బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు సూర్యుడి రెండో ఇంట్లో ఉంటాడు. బుధుడికి సంబంధించిన 11వ ఇంట్లో చంద్రుడు, చంద్రుడి నుంచి త్రయంలో బృహస్పతి ఉండడం వల్ల భాస్కర యోగం ఏర్పడుతుంది. ఈ భాస్కరయోగం కలిగిన వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
వృషభ రాశి
భాస్కర యోగం కారణంగా వృషభ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఏ ప్రయత్నం చేసిన ఈ సమయంలో విజయం సాధిస్తారు.
సింహరాశి
భాస్కరయోగం కారణంగా సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో సింహరాశి వారు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. భూములు, ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారి కోరికలు ఈ సమయంలో తీరుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి అదృష్టం కలిసివస్తుంది.
తులారాశి
తులారాశి జాతకులకు భాస్కరయోగంతో అద్భుతంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. వీరి జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. తులారాశి జాతకులకు కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి.