Raja Yoga : 2025 లో ఏడు రాజ యోగాలు.. ఈ రాశి వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raja Yoga : 2025 లో ఏడు రాజ యోగాలు.. ఈ రాశి వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం ..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 January 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Raja Yoga : 2025 లో ఏడు రాజ యోగాలు.. ఈ రాశి వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం ..!

Raja Yoga : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలోనే గ్రహాలు కదలికల కారణంగా అందరి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరంలో ఏడు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇక ఈ యోగాలన్నీ కూడా వివిధ రాశుల వారిపై నా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడు విశేష యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా సంపదల భాగ్యాన్ని కలిగిస్తున్నాయి.

Raja Yoga : 2025 లో ఏడు రాజ యోగాలు.. ఈ రాశి వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం ..!

Raja Yoga : 2025 లో ఏడు రాజ యోగాలు.. ఈ రాశి వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం ..!

Raja Yoga మాలవ్య రాజయోగం

2025 వ సంవత్సరంలో మాలవ్య రాజయోగం వలన కొన్ని రాశుల వారు కోటీశ్వరులు అవుతారు. ఇక సూర్యుడు తన సొంత ఇంట్లో లేదా ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడడం జరుగుతుంది. అయితే 2025 ఏప్రిల్ నెలలో మరియు నవంబర్ నెలలో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. వృషభ రాశి మీన రాశి మరియు తుల రాశి వారికి ఈ యోగం యొక్క ప్రయోజనలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరడంతో పాటు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

Raja Yoga గజకేసరి రాజయోగం..

చంద్రుడు గురువు కలయికతో గజ కేసరి రాజ యోగం ఏర్పడుతుంది. 2025 వ సంవత్సరంలో మార్చి నెల నుంచి జూలై నెల వరకు దీని ప్రభావం కనబడుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి ,మేష రాశి ,ధనస్సు రాశి ,కర్కాటక రాశి జాతకులకు ఈ యోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశుల వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే ఆకస్మిత ధన లాభం కలుగుతుంది.

లక్ష్మీ యోగం :  చంద్రుడు మరియు కుజుడు ఒకే రాశిలో సంచరించినప్పుడు లక్ష్మీ రాజ యోగం ఏర్పడుతుంది. ఇది జూన్ నవంబర్ నెలలో ఏర్పడుతుంది. దీని కారణంగా వృశ్చికం, కర్కాటక , మేష రాశి వారికి ఈ యోగ ప్రయోజనాలు కలిసి వచ్చేలా చేస్తుంది. వారి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక కెరియర్ లో మంచి పురోగతి ఉండడంతో పాటుగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

హంస యోగం : బృహస్పతి జాతకంలో ఒకటి, నాలుగు , ఏడు మరియు పదవ ఇంట్లో లేదా ఉచ్చ రాశిలో ఉన్నప్పుడు హంసయోగం ఏర్పడడం జరుగుతుంది. 2025 వ సంవత్సరంలో మే నుంచి అక్టోబర్ వరకు దీని ప్రభావం కనబడుతుంది. ఈ యోగం కారణంగా మీన రాశి ,కర్కాటక రాశి , ధనస్సు రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ విశేష యోగాలు కూడా : కుజుడు, బుధుడు ,శుక్రుడు, గురుడు లేదా శని ఒకటి నాలుగు లేదా ఏడు ,పదవ ఇంట్లో లేదా వాటి ఉచ్చ రాశులలో ఉన్న సమయంలో పంచ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. అయితే శని కారణంగా శశ రాజ యోగం మరియు కుజుడి వలన రుచక యోగాలు ఏర్పడతాయి. అదేవిధంగా 2025 వ సంవత్సరంలో బుధుడు సూర్యుడు ఒకే రాశులు సంచరించినప్పుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది 2025 వ సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఏర్పడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది