Shattila Ekadashi : షటితల ఏకాదశి నాడు విష్ణు దేవున్ని పూజిస్తే ఈ దోషాలు తొలగిపోతాయి….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shattila Ekadashi : షటితల ఏకాదశి నాడు విష్ణు దేవున్ని పూజిస్తే ఈ దోషాలు తొలగిపోతాయి….?

 Authored By ramu | The Telugu News | Updated on :23 January 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Shatila Ekadashi : షటితల ఏకాదశి నాడు విష్ణు దేవున్ని పూజిస్తే ఈ దోషాలు తొలగిపోతాయి....?

Shattila Ekadashi : షటితిలా ఏకాదశి పుష్య మాసంలో కృష్ణ పక్షం నాడు వస్తుంది. ఇలా రావడాన్ని షటితిల అంటారు. ఈ పరదినాన మహావిష్ణువు ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే “షర్ట్ “6, “తిల” అంటే నువ్వులు. ఏకాదశి రోజున నువ్వులను ఆరు విధాలకు ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ పరవదినాన విష్ణువును పూజిస్తే పాపాలు తొలగి,పుణ్యం కలుగుతుందని నమ్ముతారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశి వస్తూ ఉంటాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. వచ్చే మాగా మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షటితిలా ఏకాదశి అంటారు. ట్రిక్ పంచాంగం ప్రకారం 2025 జనవరిలో షటితలా ఏకాదశి తిధి జనవరి 24 2025 రాత్రి 07:25 గంటలకు ప్రారంభమై జనవరి 25, 2025 రాత్రి 08:31 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిదిని అనుసరించి షటితల ఏకాదశి జనవరి 25, 2025 శనివారం నాడు జరుపుకుంటారు.

Shattila Ekadashi షటితల ఏకాదశి నాడు విష్ణు దేవున్ని పూజిస్తే ఈ దోషాలు తొలగిపోతాయి

Shattila Ekadashi : షటితల ఏకాదశి నాడు విష్ణు దేవున్ని పూజిస్తే ఈ దోషాలు తొలగిపోతాయి….?

Shattila Ekadashi షటితల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత

షటితిల ఏకాదశి విష్ణుభక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను పాటిస్తూ, విష్ణువును పూజిస్తే, నువ్వుల దానం చేయటం వంటివి చేస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఏకాదశి వ్రతం చేయడం వల్ల పితృ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి.

Shattila Ekadashi షటితల ఏకాదశి పూజా విధానం

ఉపవాసం : షటితల ఏకాదశి నాడు నా సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్థానమాచరించి. ఉపవాసాన్ని ప్రారంభించే ముందు విష్ణువుని ప్రార్థించుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి,మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించుకోవాలి.

పూజా స్థలం సిద్ధం : పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసి, అలంకరించుకోవాలి. ఒక పీఠంపై విష్ణు విగ్రహం లేదా ఫోటో నువ్వు ఉంచాలి.
పూజా సామాగ్రి : పూజకు కావలసిన సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి.

విష్ణువును ఆరాధన చేయటం : విష్ణుమూర్తి ని పంచామృతాలతో అభిషేకించాలి. తర్వాత గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించాలి. విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తర శతనామావళి వంటి సూత్రాలను పటించాలి.

నువ్వుల వినియోగం : షటితల ఏకాదశి రోజున నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించడం చాలా ముఖ్యం.

షటితల ఏకాదశి పూజ సామాగ్రి : విష్ణు విగ్రహం లేదా ఫోటో, పుష్పాలు, గంధం, పంచామృతాలు, ధూపం, దీపం, నైవేద్యం, నువ్వులు,వస్త్రం, తాంబూలం అంటే పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి.

షటితల ఏకాదశి నాడు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించడం :

-తిల స్నానం : నువ్వుల నూనెను ఒంటికి రాసుకొని, నువ్వులు వేసిన నీటితో స్నానం చేయాలి.
– తిలోదకాలు: పితృదేవతలకు నువ్వులు కలిపిన నీటిని సమర్పించాలి.
– తిల లేపనం : నువ్వులను పేస్ట్ చేసి శరీరానికి రాసుకోవాలి.
– తిలాన్న భోజనం: నువ్వులు కలిపినవో అన్నం భుజించాలి.
– తిలహోమం: నువ్వులతో హోమం చేయాలి.
– తిల దానం : నువ్వులను లేదా నువ్వుల నూనెను బ్రాహ్మణులకు దానం చేయాలి.

షటితిల ఏకాదశి కథ : పురాణాల్లో చెప్పే ప్రకారము, ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమే విష్ణువు దేవునికి మహా భక్తురాలు. ఒకరోజు విష్ణువు ఆమెకు నువ్వుల దానం చేయమని చెప్పారు. ఆమె తన దగ్గర ఉన్న కొద్ది నువ్వులను దానం చేసింది. దీనికి ఫలితంగా ఆమెకు స్వర్గ లోకంలో ఒక ఇల్లు లభించింది. ఈ కథ షటితిల ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది.
షటితిల ఏకాదశి విష్ణువును పూజించడం ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజు వెనక ఉపవాసం ఉంటే నువ్వులను ఉపయోగించి మరియు విష్ణువును పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. పుణ్య లోకానికి ప్రాప్తి కలుగుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది