Goamtha : అష్ట దరిద్రాలను దూరం చేసే గోమాత తోక.. ఏం చేయాలో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Goamtha : అష్ట దరిద్రాలను దూరం చేసే గోమాత తోక.. ఏం చేయాలో తెలుసా?

Goamtha : మన హిందూ సంప్రదాయాల ప్రకారం గోమాతను ముఖ్య దేవుతగా పూజిస్తుంటాం. అంతే కాకుండా ఎక్కడ గోమాత కనిపించినా నమస్కారం పెట్టడం.. మనకు అందుబాటులో ఏది ఉంటే దాన్ని తినిపించడం వంటివి చేస్తుంటాం. అయితే చాలా మంది గోమాతకు పలు పదార్థాలు తినిపించి… తమ దరిద్రాన్ని, సమస్యలను వదిలించుకుంటారు. అంతే కాకుండా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఒక్క గోమాతలోనే సకల దేవతలు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే హిందువులంతా ఆవును చాలా పవిత్రంగా […]

 Authored By pavan | The Telugu News | Updated on :3 April 2022,6:00 am

Goamtha : మన హిందూ సంప్రదాయాల ప్రకారం గోమాతను ముఖ్య దేవుతగా పూజిస్తుంటాం. అంతే కాకుండా ఎక్కడ గోమాత కనిపించినా నమస్కారం పెట్టడం.. మనకు అందుబాటులో ఏది ఉంటే దాన్ని తినిపించడం వంటివి చేస్తుంటాం. అయితే చాలా మంది గోమాతకు పలు పదార్థాలు తినిపించి… తమ దరిద్రాన్ని, సమస్యలను వదిలించుకుంటారు. అంతే కాకుండా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఒక్క గోమాతలోనే సకల దేవతలు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే హిందువులంతా ఆవును చాలా పవిత్రంగా చూస్తూ.. భక్తి, శ్రద్ధలతో పూజిస్తుంటారు.అలాగే ఆవు తోకలో ఉండే ఒక వెంట్రుకను తీసుకొని మన కాలి బొటన వేలుకు కట్టుకొని మీ ఒంట్లో ఎక్కడైనా నొప్పి ఉంటే… ఆ కాలి బొటన వేలుతో నొప్పి ఉన్న చోటు అనుకుంటే ఆ నొప్పి తగ్గుతుందని చాలా మంది చెబుతుంటారు.

అయితే కొంత మంది స్వామీజీలు, ఆధ్యాత్మిక పండితుల చేతిలో తాడు లేదా విసన్న కర్రకు తెల్లటి దారాలు కట్టి ఉంచుతారు. భక్తుల ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు… వారందరినీ వెన్ను తట్టి మరీ ఆశీర్వదిస్తుంటారు. అయితే ఈ ఈకలు ఏంటో చాలా మందికి తెలియదు. ఆ వస్తువుల్లో కూడా గోవు తోకలోని వెంట్రుకలు ఉంటాయి. అలా వాటిలో ఉండే పాజిటివ్ ఎర్జీ… ఆశీర్వదించే సమయంలో భక్తుల్లోకి చేరుతుందని మన పెద్దలు చెబుతుంటారు. అంతే కాకుండా చాలా మంది గోమాత తోకకున్న వెంట్రుకలను కాలికి కట్టుకోవడం లేదా.. మొలతాడుకు కట్టుకోవడం, తాయత్తులో వాడటం వంటివి చేస్తుంటారు.గోమాత తోకలో లక్ష్మీ దేవి ఉంటుంది.

you must do this for goamtha tail for good wealth

you must do this for goamtha tail for good wealth

అందు చేతనే ఎక్కువ మంది తోకను ముట్టుకుంటూ ప్రార్థిస్తూ.. ఉంటారు. ఇక గోవు భాగంలోనే తోక నుండి కొమ్ముల వరకు మొత్తం దేవతలందరూ కల్గి ఉంటారు. అందు వల్ల గోవులను గోమాతగా భావించి పూజలు చేస్తుంటారు. విజ్ఞఆన పరంగా చూసుకున్నట్లయితే గోవు పంచితం… క్రిమి సంహారకంగా వాడుతారు. అలాగే గోవుపాలు తల్లిపాలతో సమానం. వీటిని తాగడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే…. గోమాత తోకను పూజించమని చెప్పండి. పదే పదే తోకను తాకుతూ… ప్రార్థించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతే కాకుండా లక్ష్మీ దేవి మీ ఇంటికి వచ్చి చేరుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది