గుడికో గోమాత కాకినాడలో నేడు ప్రారంభం !
గుడికో గోమాత కాకినాడలో రేపు ప్రారంభం !సనాతన హిందూధర్మ పరిరక్షణలో భాగంగా గోసంరక్షణలో భాగంగా గుడికో గోమాత కార్యక్రమాన్ని టీటీడీ డిసెంబర్ 7న ప్రారంభించింది. దీనిలో భాగంగా డిసెంబరు 12వ తేదీ (నేడు) శనివారం తూర్పుగోదావరి జిల్లాలో గుడికో గోమాత కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభిస్తారు.

Gomatha Temple in Kakinada
ఉదయం 10 గంటలకు కాకినాడలోని శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయానికి ఆవు , దూడను ఆయన అందిస్తారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.మొదట ఈ కార్యక్రమాన్ని డిసెంబరు 7వ తేదీ విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో, 10వ తేదీ తెలంగాణ కు సంబంధించి హైదరాబాద్ లో టీటీడీ చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించారు.
Advertisement
WhatsApp Group
Join Now