Lakshmis Kataksha : శ్రావణంలో ఈ 5 పనులు చేయకపోతే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికి లభించదు… తప్పక తెలుసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lakshmis Kataksha : శ్రావణంలో ఈ 5 పనులు చేయకపోతే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికి లభించదు… తప్పక తెలుసుకోండి…!

Lakshmis Kataksha : సౌర మాసం ప్రకారం హిందూ క్యాలెండర్ ను అనుసరించి శ్రావణం 5వ నెలలో వస్తుంది. ఈ మాసం ఎంతో పవిత్రమైనది. ఆధ్యాత్మికంగా విశిష్టం కలిగిన శ్రావణం శివారాధనకు కూడా శ్రేష్టమైనది. ఈ నెలలో సూర్యుడు సింహరాశి లోకి ప్రవేశిస్తాడు. హిందువులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు నోములు పూజలు చేస్తారు. అయితే శ్రావణమాసంలో ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది…? ఏ పూజలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయి..? అనేది […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Lakshmis Kataksha : శ్రావణంలో ఈ 5 పనులు చేయకపోతే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికి లభించదు... తప్పక తెలుసుకోండి...!

Lakshmis Kataksha : సౌర మాసం ప్రకారం హిందూ క్యాలెండర్ ను అనుసరించి శ్రావణం 5వ నెలలో వస్తుంది. ఈ మాసం ఎంతో పవిత్రమైనది. ఆధ్యాత్మికంగా విశిష్టం కలిగిన శ్రావణం శివారాధనకు కూడా శ్రేష్టమైనది. ఈ నెలలో సూర్యుడు సింహరాశి లోకి ప్రవేశిస్తాడు. హిందువులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు నోములు పూజలు చేస్తారు. అయితే శ్రావణమాసంలో ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది…? ఏ పూజలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయి..? అనేది ఇప్పుడు మన వివరంగాా తెలుసుకుందాం. శ్రావణ సోమవారం వ్రతం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపడతారు. మంగళవారం మంగళ గౌరీ కి కూడా విశిష్టత ఉంది. శ్రావణం శివుని ఆరాధనకు అనుకూలమైనది. శివుడుని పూజించడం వలన వివాహంలో ఏర్పడిన ఆటంకాలు అన్ని తొలగి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. శివపార్వతుల అనుగ్రహం శ్రావణంలో భక్తులకు లభిస్తుంది.

భక్తులు తమ తప్పులను మన్నించమంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు. ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి స్నానం అనంతరం శివాలయాలను దర్శించాలి. పాలు జలంతో శివుడికి అభిషేకం చేసి,ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. శ్రావణమాసంలో సిద్ధ శివలింగాన్ని ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేయాలి. చల్లటి నీళ్లతో శుద్ధి చేసి పాలతో అభిషేకం చెయ్యాలి. బిల్వపత్రాలను విభూతిని సమర్పించాలి. దగ్గర లో ఉన్న చెరువులకు నదులకు వెళ్లి చేపలకు ఆహారాన్ని వెయ్యాలి. గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని వాటికి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చేపలకు ఆహారాన్ని ఇవ్వడం అంటే శివుడికి అందించినట్లే మహా మృత్యుంజయ మంత్రం వలన అనారోగ్యం సమస్యలు తొలగిపోతాయి. దీన్ని రోజుకి 108 సార్లు జపించాలి. మహా మృత్యుంజయ హోమం కూడా శ్రావణ సోమవారం నాడు నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆటంకాలు పెళ్ళి సమస్యలు ఎదురుకుంటూ ఉంటే కనుక కుంకుమపువ్వుతో కలిపిన పాలను శివుడికి అభిషేకం చేయాలి.

Lakshmis Kataksha శ్రావణంలో ఈ 5 పనులు చేయకపోతే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికి లభించదు తప్పక తెలుసుకోండి

Lakshmis Kataksha : శ్రావణంలో ఈ 5 పనులు చేయకపోతే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికి లభించదు… తప్పక తెలుసుకోండి…!

శివపార్వతుల అనుగ్రహం పొంది వ్యక్తిగత జీవితాలలో ఏర్పడిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఆవులు గేదెలకు పచ్చ కట్టి తినిపిస్తే శ్రేయస్సు కలుగుతుంది. విజయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంట్లో మానసిక ప్రశాంతత ఐశ్వర్యం లభించాలంటే రోజు పేదలకు అన్నదానం చేయాలి. దీనివల్లపూర్వికులు ఆత్మకు శాంతి కలుగుతుంది. 21 బిల్వపత్రాలపై చందనంతో ఓం నమశ్శివాయ అని రాసి శివలింగానికి అభిషేకం చేస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రావణంలో గోమూత్రంతో రోజు ఇంటిని శుద్ధి చేస్తే అనుగ్రహంతో పాటు విజయము దక్కుతుంది. శ్రావణ సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా కుజదోష ప్రభావం తగ్గుతుంది. కొన్ని పనులు చేయడం వలన ప్రతికూలతలు ఎదురవుతాయి. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. అలాగే మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి. ఈ నెల రోజులు కూడా శాఖాహారమే తీసుకోవాలి. శ్రావణంలో పాములను చంపితే దోషం పట్టుకుంటుంది. పాములు శివుడికి ప్రియమైనవిగా భావిస్తారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది