Bigg Boss 8 Telugu : వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్‌లోకి వ‌చ్చేది ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు ఏకంగా ప‌ది మందా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 8 Telugu : వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్‌లోకి వ‌చ్చేది ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు ఏకంగా ప‌ది మందా..!

Bigg Boss 8 Telugu : బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్ రాను రాను ఆస‌క్తిక‌రంగా మారుతుంది. గ‌త వారం సోనియా ఎలిమినేట్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఆమెని నాగుపాముగా వర్ణించిన నెటిజన్లు, ఆమెని ఎలిమినేట్‌ చేసేంత వరకు నిద్ర పోలేదని చెప్పాలి. ఆమెకి వ్యతిరేకంగా భారీ స్థాయిలో క్యాంపెయిన్‌ జరిగింది. ఇందులో నిఖిల్‌ ఫ్యాన్సే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సోనియా మాయలో పడి నిఖిల్‌ ఆట బాగా ఆడటం లేదనే కామెంట్స్ వచ్చాయి. […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 October 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్‌లోకి వ‌చ్చేది ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు ఏకంగా ప‌ది మందా..!

Bigg Boss 8 Telugu : బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్ రాను రాను ఆస‌క్తిక‌రంగా మారుతుంది. గ‌త వారం సోనియా ఎలిమినేట్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఆమెని నాగుపాముగా వర్ణించిన నెటిజన్లు, ఆమెని ఎలిమినేట్‌ చేసేంత వరకు నిద్ర పోలేదని చెప్పాలి. ఆమెకి వ్యతిరేకంగా భారీ స్థాయిలో క్యాంపెయిన్‌ జరిగింది. ఇందులో నిఖిల్‌ ఫ్యాన్సే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సోనియా మాయలో పడి నిఖిల్‌ ఆట బాగా ఆడటం లేదనే కామెంట్స్ వచ్చాయి. నిఖిల్‌ని, పృథ్వీని తన కంట్రోల్‌లో పెట్టుకుని వారిని చెడగొడుతుందనే ట్రోలింగ్‌ నడిచింది. మొత్తంగా సోనియా బిగ్‌ బాస్‌ని వీడింది. ఇక సోనియా ఎలిమినేషన్‌తో నిఖిల్‌కి బ్రెయిన్‌ వాష్‌ చేస్తుంది య‌ష్మి. గేమ్‌ ఆడాలని, మనుషులు ముఖ్యం కాదని చెబుతుంది.

Bigg Boss 8 Telugu ఒకేసారి ప‌ది మందా..

ఇక సోమవారం (29వ) రోజు ఐదో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జరిగింది. నాలుగు వారాలు చాలా వాడి వేడిగా నామినేషన్ల ప్రక్రియ జరిగింది. కానీ ఐదో వారం మాత్రం ఆ వేడి కనిపించడం లేదు. పైగా నామినేట్‌ చేసేటప్పుడు ఆ కంటెస్టెంట్‌ ఫోటోలు మంటలో వేయాల్సింది. అందులో మంటలు ఉన్నాయి, కానీ కంటెస్టెంట్లు వాదనలో అంతటి ఫైర్‌ కనిపించలేదు. దీంతో ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ చాలా చప్పగా సాగింది. అయితే మ‌ణికంఠ ఇన్నాళ్లు చాలా కామ్ గోయింగ్‌గా ఉండ‌గా,అత‌ను పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కూడా అనిపించ‌లేదు. కాని చూడబోతుంటే అటు యష్మి, ఇటు పృథ్వీ.. మణికంఠకి హైప్‌ ఇస్తున్నారు. ఆయన్ని హీరో చేస్తున్నారు. ప్రతి సారి అతన్నే టార్గెట్‌ చేస్తూ వాళ్లు జీరో అవుతున్నారు. మణికంఠని హీరోని చేస్తున్నారు. వీరి టార్గెటే అతనికి సింపతిగా మారుతుంది. మణికంఠని టార్గెట్‌ చేసిన వాళ్లంతా పరోక్షంగా అతన్ని స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా మారుస్తున్నారు.

Bigg Boss 8 Telugu వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్‌లోకి వ‌చ్చేది ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా ప‌ది మందా

Bigg Boss 8 Telugu : వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్‌లోకి వ‌చ్చేది ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు ఏకంగా ప‌ది మందా..!

ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గట్టిగానే ఉండబోతున్నాయట. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ప‌ది మంది రాబోతున్నారట‌. వైల్డ్ కార్డ్ ద్వారా యాంకర్‌ రవి రాబోతున్నాడట. యాంకర్‌ రవితోపాటు మెహబూబ్‌ దిల్సే కూడా రాబోతున్నారట. ఆయన కూడా కన్ఫమ్‌ అయినట్టు సమాచారం. కొత్తగా గంగవ్వ పేరు తెరపైకి వచ్చింది. గత సీజన్‌లో సందడి చేసిన గౌతమ్‌ కృష్ణ కూడా రాబోతున్నారట. నయని పావని కూడా ఈ సారి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌లోకి అడుపెడుతున్నట్టు సమాచారం. శోభాశెట్టిని మళ్లీ తీసుకురాబోతున్నారట. గత సీజన్‌లోనే ఫన్‌తో ఆకట్టుకున్న టేస్టీ తేజని సైతం వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ లేడీ కమెడియన్‌ రోహిణి దించుతున్నారట. అలాగే హరితేజని కూడా తీసుకురాబోతున్నారు. ఇలా సుమారు పది మంది మాజీ కంటెస్టెంట్లని బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారట.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది