NTR – Jayasudha : 50 ఏళ్ల ఎన్టీఆర్ తో 18 ఏళ్ల జయసుధ రొమాన్స్.. అప్పుడు ఏం జరిగిందో తెలుసా..?

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 8 January 2023, 2:40 pm

NTR – Jayasudha : సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్ అనే పేరు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిలో ఉండిపోతుంది. ఎన్ని తరాలు మారినా… ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటారు. అంతలా సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయి. సీనియర్ ఎన్టీఆర్ అంటేనే కొందరు హీరోయిన్లతో హిట్ పెయిర్ ఉండేది. ఎన్టీఆర్, జయప్రద ఒక హిట్ పెయిర్. ఎన్టీఆర్, శ్రీదేవి మరో హిట్ పెయిర్. అలా.. ఎన్టీఆర్ కు, కొందరు హీరోయిన్లతో జోడి అంటే ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి.

అయితే.. ఎన్టీఆర్.. జయసుధతో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ.. వాళ్ల పెయిర్ అంతగా సెట్ అయ్యేది కాదు. వాళ్లిద్దరూ కలిసి నటించిన యుగంధర్ అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో నటించారు. అందులో జయసుధ హీరోయిన్. కానీ.. ఈ సినిమాలో పెద్దగా పాటలు, రొమాన్స్ గట్రా లేకపోయినా కొన్ని హీటెక్కించే సీన్లు మాత్రం ఉన్నాయి. కాకపోతే ఆ సీన్లలో ఎన్టీఆర్, జయసుధను నటింపజేయడం కోసం డైరెక్టర్ చాలా కష్టపడాల్సి వచ్చిందట.

18 year old jaya sudha acted with 50 year old ntr

18 year old jaya sudha acted with 50 year old ntr

NTR – Jayasudha : దానికి కారణం… ఎన్టీఆర్ కొద్దిగా లావెక్కడమేనా?

దానికి కారణం ఎన్టీఆర్ కు అప్పటికే 50 ఏళ్లు రావడం, కొద్దిగా ఆయన లావెక్కినట్టు కనిపించడం, జయసుధ మాత్రం సన్నగా కనిపించడం, తన వయసు అప్పుడు 18 నుంచి 20 ఏళ్ల లోపే ఉండటంతో ఇద్దరి మధ్య రొమాన్స్ సీన్లలో నటింపజేసేందుకు డైరెక్టర్ కెఎస్ఆర్ దాస్ చాలా కష్టపడాల్సి వచ్చిందట. అందుకే సినిమాలో ఎక్కువగా జయసుధతో డ్యుయెట్స్ లేకుండా ఎన్టీఆర్ తో సోలోగా సాంగ్స్ చేయించారు. ఇద్దిరి కాబో బాగానే ఉన్నప్పటికీ… ఎందుకో సింగిల్ ఫ్రేమ్ లోకి వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది పడినట్టు అప్పట్లో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

Also read

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp