Rajinikanth : రజనీకాంత్ సినిమాలో పని చేయడం పెద్ద నరకం.. మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Rajinikanth : సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు తెర మీద కనిపించాడంటే చాలు.. ఆ సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయి. సినిమా టాక్ ఎలా ఉన్నా సరే కోట్లు రావడం మాత్రం గ్యారంటీ. రజని అంటే అంతలా క్రేజ్ ఉంది సినీ అభిమానుల్లో. ఇక రజనీ కాంత్ సినిమాలకు ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తే ఆ సినిమాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతాయో వేరే చెప్పనక్కర్లేదు.
అటువంటి ఏఆర్ రెహ్మన్ రజనీకాంత్ సినిమాలకు వర్క్ చేయడం అంటే చాలా పెద్ద నరకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఏ ఆర్ రెహ్మన్ వ్యాఖ్యల గురించి సినీ అభిమానులు పెద్ద షాక్ అవుతున్నారు. అసలు రజనీకాంత్ సినిమాల గురించి రెహ్మన్ అంతలా ఎందుకు సంచలన వ్యాఖ్యలు చేశాడని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు
Rajinikanth : షాక్ అవుతున్న అభిమానులు..
. రజనీకాంత్ సినిమాలు ఎక్కువగా మార్చి, ఏప్రియల్ నెలల్లో ప్రారంభించే వాళ్లమని కానీ ఆ సినిమాలు పూర్తయ్యే సరికి దీపావళి వచ్చేదని ఆయన చెప్పుకొచ్చాడు. తనకు దీపావళి, పొంగల్ అంటూ పండుగల ఆనందం లేకుండా పోయేదని అందువల్ల తాను చాలా స్ట్రగుల్ అయ్యానని చెప్పుకొచ్చాడు.వీరి కాంబినేషన్ లో అరుణాచలం, ముత్తు, శివాజీ, రోబో, రోబో2, కొచ్చడయాన్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఎన్నో వచ్చాయి.
రజనీ సినిమాకు పని చేసినన్ని రోజులు వేరే ఇతర ఏ సినిమాకు పని చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. రజనీ కాంత్ ప్రస్తుతం నటించిన పెద్దన్న సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కానీ కలెక్షన్లలో మాత్రం దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల పై చిలుకు కలెక్షన్లను సాధించింది. తమిళనాడులో వర్షాలు లేకపోతే ఈ సినిమా వసూళ్లు ఇంకా పెరిగేవని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.