Rathan Rajputh : పొలం పనులు చేస్తున్న సీరియల్ నటి.. ఇకపై నటనకు..
Rathan Rajputh : ప్రముఖ హిందీ సీరియల్ నటి రతన్ రాజ్‌పుత్ కు మంచి గుర్తింపు ఉంది. హిందీ సీరియల్ అగ్లే జనమ్ మోహె బితియా హై కిజో తో పాపులర్ అయింది. అలాగే హిందీ బిగ్‌బాస్ 7 లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిహార్‌లో పుట్టి పెరిగిన రతన్ అక్కడే తన చదువుకుంది. 2006లో రావన్ సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అగ్లే జనమ్ మోహె బితియా హై కిజో, మహాభారత్, సంతోషి మా సహా పలు సీరియళ్లలో నటించింది. అయితే ఇటీవల రతన్ రాజ్ పుత్ వ్యవసాయం చేస్తూ కనిపించింది. పొలంలోకి దిగి నాట్లు వేస్తోంది.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మట్టి రుచి చూడు. మట్టిని రక్షించు. ఈ మట్టిలో ఓ కళ ఉంది… ఈ పల్లెటూరి జీవితం ఎన్నో పాఠాలను.. ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఎన్నో కొత్త పాత్రలను పరిచయం చేస్తుంది. గొప్ప ఆర్టిస్ట్, గొప్ప వ్యక్తిగా ఎదిగేందుకు తోడ్పడుతుందని క్యాప్షన్ ఆడ్ చేసింది. అయితే ఈ ఫొటోస్ చూసిన రతన్ రాజ్ పుత్ ఫ్యాన్స్ ఆమె నటనకు గుడ్‌బై చెప్పబోతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రతన్ స్పందించించారు.
ప్రస్తుతం తను బిహార్‌లో ఉన్నట్లుల అక్కడే పొలం కొనడానికి వచ్చానని చెప్పింది. నటి కాకపోయుంటే తను రైతు అవ్వలనుకుందంట. అందుకే ఇప్పుడు వ్యవసాయంపై దృష్టి మళ్లించినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వరి నాటు వేయడం నేర్చుకుంటుందట. అయితే నటనకు ముగింపు చెప్పడం లేదని ఎలాంటి ఆందోళన వద్దని చెప్పింది. అలాగే తన పెళ్లి విషయంలో ఆసక్తి కర విషయాలు చెప్పింది. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని.. కానీ సరైన పార్ట్ నర్ దొరకలేదని చెప్పుకొచ్చింది. అయితే స్వేచ్ఛగా జీవితాన్ని గడపాలని తాను అనుకుంటున్నట్లు తెలిపింది.