రకుల్ ప్రీత్ సింగ్ ఫిలాసఫీ బాగానే చెప్పింది .. తెలివంటే అదేమరి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

రకుల్ ప్రీత్ సింగ్ ఫిలాసఫీ బాగానే చెప్పింది .. తెలివంటే అదేమరి..!

రకుల్ ప్రీత్ సింగ్ లో మంచి ఫిలాసఫర్ ఉందని తన లేటెస్ట్ కామెంట్స్ చూస్తుంటే తెలుస్తోంది. కెరటం సినిమాతో టాలీవుడ్ కి ఎంటరైన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్‌ప్రెస్ సినిమాతో బాగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలలో నటించి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. అయితే అనూహ్యంగా ఫ్లాప్స్ వచ్చిన రకుల్ ప్రీత్ కి […]

 Authored By govind | The Telugu News | Updated on :11 January 2021,1:30 pm

రకుల్ ప్రీత్ సింగ్ లో మంచి ఫిలాసఫర్ ఉందని తన లేటెస్ట్ కామెంట్స్ చూస్తుంటే తెలుస్తోంది. కెరటం సినిమాతో టాలీవుడ్ కి ఎంటరైన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్‌ప్రెస్ సినిమాతో బాగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలలో నటించి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. అయితే అనూహ్యంగా ఫ్లాప్స్ వచ్చిన రకుల్ ప్రీత్ కి మళ్ళీ టాలీవుడ్ లో వరసగా అవకాశాలు దక్కుతున్నాయి.

Venkatadri Express (#7 of 17): Extra Large Movie Poster Image - IMP Awards

కేవలం తెలుగులోనే కాదు హిందీలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ బాలీవుడ్ లో కూడా హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తోంది. అయితే పడి లేచిన కెరటం లా రకుల్ ప్రీత్ ఇప్పుడు మంచి ఫాం లోకి వచ్చింది. తెలుగులో క్రిష్ సినిమా కంప్లీట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ నితిన్ తో చెక్ అన్న సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో మేడే సినిమా తో పాటు తాజాగా మరో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుంది.

Mayday: Rakul Preet Singh Joins Ajay Devgn & Amitabh Bachchan Starrer, Her  Character Deets Revealed!

అంతేకాదు తమిళ సినిమాలు రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఉన్నాయి. అయితే ఏ ఇండస్ట్రీ లో అయినా పోటీ విపరీతంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అదే సినిమా ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాని రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తనకి తానే పోటీ అని సెన్షేషనల్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయింది. ఇండస్ట్రీలో తనకి ఏ హీరోయిన్ తో పోటీ లేదని… ఉండదని నాకు నేనే పోటీ అని అంటోంది. ఒకరకంగా రకుల్ లో మంచి ఫిలాసఫర్ ఉందని తాజా కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతోందని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఈ కామెంట్స్ ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకొనే ఇలా తెలివిగా కామెంట్స్ చేసిందని అంటున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది