Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2025,11:30 pm

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు Dil Raju నిర్మించిన చిత్రం తమ్ముడు Nithin  Thammudu Movie Review. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో Pawan Kalyan వకీల్ సాబ్ లాంటి హిట్ సాధించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించ‌డం విశేషం. ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటీనటులు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

Thammudu Movie Review నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review హిట్ కొట్టిన‌ట్టేనా?

ఈ సినిమా అక్కా-తమ్ముళ్ల మధ్య ఎమోషనల్ కంటెంట్ తో కూడిన యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటుంది.సినిమాలోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మరియు హింసాత్మక సన్నివేశాలు చాలా తీవ్రంగా ఉండటం వల్ల సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. రెండు ప్రధాన యాక్షన్ సీక్వెన్సులు చాలా వైలెంట్ గా ఉన్నాయని, వాటిని తొలగిస్తే ‘U/A’ ఇస్తామని చెప్పినా, సినిమా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం దర్శక నిర్మాతలు ఆ సన్నివేశాలను అలాగే ఉంచడానికి అంగీకరించారు. చిత్ర‌ కథ అక్కా-తమ్ముళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా, అమ్మ నాన్న లేని నితిన్ ను అతని అక్క (లయ నటించింది) పెంచి పెద్ద చేస్తుంది. వారి మధ్య బంధం, అలాగే 24 గంటల వ్యవధిలో జరిగే సంఘటనలు, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందించబడింది. సినిమాలోని 80% అటవీ ప్రాంతంలో చిత్రీకరించబడింది.

ఈ సినిమా కథ అక్కా-తమ్ముళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా, అమ్మ నాన్న లేని నితిన్ ను అతని అక్క (లయ Laya నటించింది) పెంచి పెద్ద చేస్తుంది. వారి మధ్య బంధం, అలాగే 24 గంటల వ్యవధిలో జరిగే సంఘటనలు, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందించబడింది. సినిమాలోని 80% అటవీ ప్రాంతంలో చిత్రీకరించబడింది. ఈ మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రఫిని అందించారు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్, విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ యాక్షన్ కొరియోగ్రఫిని అందించారు. ఈ సినిమాను సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Thammudu Movie Review కథ :

అక్క‌కి ఇచ్చిన‌ మాట కోసం నిలబడే పాత్ర‌లో నితిన్ క‌నిపిస్తాడు. ట్రైబల్ ఏరియాలో నివసిస్తున్న ప్రజలను రక్షించేందుకు వెళ్లిన హీరో అక్కడ ఎదురైన కష్టాలు, సమస్యలను ఎదుర్కొన్న విధానం కథకు ప్రధాన అండగా నిలుస్తుంది.ఈ క్రమంలో అతడు తన వాగ్దానాన్ని నిలబెట్టాడా? ఆ ప్రాంత ప్రజలతో అతడి అనుబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం స్క్రీన్‌పైనే చూడాల్సిందే.

Thammudu Movie Review విశ్లేషణ :

దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ సినిమాను బ్రదర్-సిస్టర్ ఎమోషన్ ఆధారంగా తెరకెక్కించినప్పటికీ, కథను తెరమీద ప్రెజెంట్ చేయడంలో సరైన క్లారిటీ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.కథ పేపర్ మీద బాగున్నా, స్క్రీన్‌పైన కొన్ని సన్నివేశాలు క్లిష్టంగా, మరికొన్ని కన్ఫ్యూజింగ్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే మరింత క్రిస్ప్‌గా ఉంటే బెటర్ అయ్యేది.ఫస్టాఫ్‌లో కథలోకి రావడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. ఈ ఫేజ్‌లో ఉన్న కొన్ని అనవసరమైన సీన్లు సినిమా రన్‌ను మందగించాయనే చెప్పాలి. సెకండాఫ్‌లోని కొన్ని ఎమోషనల్ సీన్లు మాత్రమే కొద్దిగా ఎంగేజ్ చేస్తాయి.

నటుల నటన : నితిన్ నటన పరంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పాత్రలో వేరియేషన్లను బాగా ప్రెజెంట్ చేసినా, కథ సరైన ఎమోషనల్ కన్‌కెక్షన్ ఇవ్వకపోవడంతో అది ప్రేక్షకుడికి పూర్తిగా కనెక్ట్ కాలేదు.సప్తమి గౌడ పాత్రకు మంచి స్కోప్ ఉన్నా, నటన పరంగా సరైన పనితీరు కనబరిచింది.వర్ష బొల్లామా, లయ, సురబ్ సత్యదేవ్ లాంటి ఆర్టిస్టులు తమ పాత్రల్లో నాణ్యత కనబరిచారు.ముఖ్యంగా విలన్‌గా సత్యదేవ్ కొన్ని సన్నివేశాల్లో చాలా పవర్‌ఫుల్‌గా నటించాడు.

టెక్నికల్ అంశాలు : అంజనీష్ లోక్ నాథ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బలంగా నిలిచింది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది.విజువల్స్ డీసెంట్‌గా ఉన్నా, ఇంకాస్త విజువల్ గ్రాండియర్ ఉంటే సినిమాకు మరింత బలమయ్యేది.ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొన్ని లాగ్ సీన్స్ తొలగించి ఉంటే సినిమా మరింత గ్రిప్‌ఫుల్‌గా ఉండేది.ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్స్‌లెంట్‌గా ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన సినిమా కావడంతో స్థాయిని నిరూపించే ప్రయత్నం కనిపిస్తుంది, కానీ కంటెంట్ వాస్తవానికి మిస్సయింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది