Adipurush Movie : ఆదిపురుష్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి బిగ్ బ్యాడ్ న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Adipurush Movie : ఆదిపురుష్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి బిగ్ బ్యాడ్ న్యూస్ !

Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతాదేవిగా నటించింది. అలాగే రావణుడు పాత్రలో రన్వీర్ సింగ్ నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్లు విడుదలయ్యాయి. దీంతో ఈ […]

 Authored By aruna | The Telugu News | Updated on :11 June 2023,5:15 pm

Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతాదేవిగా నటించింది. అలాగే రావణుడు పాత్రలో రన్వీర్ సింగ్ నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్లు విడుదలయ్యాయి. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా 2D 3D లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది. అయితే ఊహించని విధంగా ఐమాక్స్ చూసేవారికి నిరాశ ఎదురయింది.

ఆదిపురుష్ సినిమా 3d ఐమాక్స్ ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అయ్యారు కానీ దానికి ఒక హాలీవుడ్ సినిమా బిగ్ బ్రేక్ వేయడం ఆశ్చర్య పరుస్తుంది. వార్నర్ బ్రదర్స్ నిర్మించిన హాలీవుడ్ సినిమా ది ఫ్లాష్ అదే రోజున విడుదలవుతోంది. దీంతో ఇండియా ప్రతినిధులు అన్ని ఐమాక్స్ స్క్రీన్ లను బ్లాక్ చేశారు. ఇండియాలో ఐమాక్స్ విడుదల ప్రణాళికలను నిలిపి వేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే 550 కోట్ల వరకు బిజినెస్ జరిపిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Adipurush Movie

Adipurush Movie

తెలుగులో ఈ సినిమాకి బాగానే డిమాండ్ ఉన్న బాలీవుడ్ లో ఈ సినిమాకి హైప్ పెంచేందుకు అవసరమైన ప్రచారం సాగుతుంది. అలాగే అమెరికాలో తెలుగు వర్షన్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. కానీ హిందీ వర్షన్ డల్ గా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ టీం అమెరికాలో ప్రమోషన్స్ కోసం వెళుతున్నారని సమాచారం. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తర్వాత ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. సినిమా బాగుంటే ప్రభాస్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. చూడాలి ఈ సినిమా ఎటువంటి టాక్ ను ఇస్తుందో.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది